CM Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన బాట పట్టారు.. ఈరోజు ఉదయం 9.30 గంటలకు అమరావతి నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఢిల్లీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రి తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. ఒకే రోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి రానున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పలు సందర్భాల్లో ఢిల్లీలో పర్యటించారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర అంశాలపై చర్చలు జరిపిన విషయం విదితమే..
జాతీయం
CM Chandrababu Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు

ఈ కంటెంట్‌ను NTV Telugu - Andhra Pradesh ప్రచురించింది; IB9TV దీనిని రాయలేదు, ఎడిట్ చేయలేదు. అసలు వార్త చూడండి
