Sreeleela : శ్రీలీల కెరీర్ ఆరంభంలో హిట్స్ కొట్టినా తర్వాత వరుస సినిమాలు చేసి వరుస ఫ్లాప్స్ చూసింది. దీంతో శ్రీలీల పని అయిపొయింది అన్నారు అంతా. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ లో బెస్ట్ డ్యాన్సర్ శ్రీలీల. గ్లామర్ కూడా ఉండటంతో అవకాశాలు మాత్రం వచ్చాయి. కానీ గత కొన్నాళ్లుగా శ్రీలీల కొన్ని సినిమాలు వదిలేసింది. కొన్ని సినిమాలు అసలు ఒప్పుకోలేదు.

ఇప్పుడు శ్రీలీల ధనుష్ ఓం సినిమాతో రాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా శ్రీలీల తను సినిమాలకు బ్రేక్ ఇవ్వడం గురించి మాట్లాడింది.

Also Read : Sreeleela : పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య గురించి శ్రీలీల స్పీచ్.. ఏమందంటే..

శ్రీలీల మాట్లాడుతూ.. ఒక రెండేళ్లుగా సినిమాలు చేయలేదు. మెడిసిన్ అయిన తర్వాత ఇంటర్న్‌షిప్ ముంబైలో చేస్తున్నాను. ఆ టైంలో ఎన్ని సినిమాలు వచ్చినా చేయలేదు. షూటింగ్స్ డేట్స్ ఇవ్వలేకపోయాను. మీ అందరికి తెలుసు నేను చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చేసాను. ఆ సమయంలో ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. అందుకే ఏది వస్తే అది చేసుకుంటూ ఒక ఫ్లోలో వెళ్ళిపోయాను. అయినా మీరు ప్రేమ చూపించారు. ఆదరించారు. కొన్నాళ్ల తర్వాత నేను ఆలోచించాను. నేను చేస్తున్న తప్పులేంటి అని ఆలోచించాను. ఈ గ్యాప్ లో కొంత సమయం దొరికినపుడు ఆలోచించాను నేను ఏం చేయాలి అని.

అలాంటి సమయంలో ఓం సినిమా నా దగ్గరకు వచ్చింది. మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, మన డెసిషన్స్ మనం తీసుకున్నప్పుడు లైఫ్ మారిపోతుంది. ఈ సినిమా డైరెక్టర్ కి థ్యాంక్యూ చెప్పాలి. ఆ సమయంలో ఈ కథ విన్నాను. ఆయన కలిసిన వెంటనే ఇందులో పాటలు ఉండవు అని చెప్పారు. దాంతో చాలా రిఫ్రెష్ గా అనిపించింది. ఈ డైరెక్టర్ నన్ను వేరే విధంగా మార్చారు. ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాను అని తెలిపింది.

Also See : Aadya : ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసిన పవన్ కళ్యాణ్ కూతురు.. ఆద్య లేటెస్ట్ ఫొటోలు వైరల్..