Sreeleela : తాజాగా ధనుష్ ఓం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా రేణు దేశాయ్ ఒక కీలక పాత్రలో నటించింది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రేణు దేశాయ్ తన కూతురు ఆద్యని కూడా తీసుకొని వచ్చింది. గతంలో ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆద్య సెట్స్ కి వెళ్ళింది. అక్కడ శ్రీలీలతో మంచి పరిచయం ఏర్పడింది.

దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల రేణు దేశాయ్ గురించి మాట్లాడుతూ ఆద్య గురించి కూడా మాట్లాడింది.

Also See : Aadya : ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసిన పవన్ కళ్యాణ్ కూతురు.. ఆద్య లేటెస్ట్ ఫొటోలు వైరల్..

శ్రీలీల మాట్లాడుతూ.. రేణు గారు నేను మీ బుర్ర బాగా తిన్నాను షూట్ లో. రెండు రోజులు షాపింగ్ మాల్ లో షూట్ అప్పుడు బాగా ఎంజాయ్ చేసాము. మీరు 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అసలు డిఫరెన్స్ లేదు. ఆవిడ అప్పటి ఫోటో కూడా చూపించారు. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు.

ఆద్య నువ్వు ఒక గొప్ప మహిళగా పెరుగుతున్నావు. నాకు ఇంకా గుర్తు ఉంది నిన్ను కలిసినపుడు నీకు షార్ట్ హెయిర్ ఉంది. ఇప్పుడు మళ్ళీ నిన్ను చూడటం ఆనందంగా ఉంది. నీ పుట్టిన రోజు నాడు కలిసాము ఇవాళ మళ్ళీ కలవడం సంతోషంగా ఉంది అని తెలిపింది.