Sai Pallavi and Sreeleela Dance: హీరో ధనుష్ లీడ్ రోల్ గా నటించిన ‘O.M’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, రేణు దేశాయ్ వంటి ప్రముఖులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

ఈ వేడుకలో హీరోయిన్లు సాయిపల్లవి, శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో భాగంగా ఇద్దరూ కలిసి స్టేజ్‌పై డాన్స్ చేయడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. సహజమైన డాన్స్‌తో ఆకట్టుకునే సాయిపల్లవి తన స్టెప్పులతో అలరించగా.. శ్రీలీల కూడా ఆమెతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేశారు. వీరిద్దరి డాన్స్‌ను చూసిన హీరో ధనుష్ చప్పట్లు కొడుతూ అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలశ్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.