జార్జియాకు చెందిన ఇవా అనా మారియా అనే చిన్నారి ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో షారుఖ్ ఖాన్, కాజోల్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ (DDLJ) సినిమాలోని ‘మెహందీ లగా కే రఖ్నా’ పాటకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. పాటలోని లిరిక్స్‌ను పాడుతూ, ఎంతో కాన్ఫిడెంట్‌గా స్టెప్పులు వేసింది. ఆమె ముఖంలో కనిపించిన ఆనందం, డ్యాన్స్‌లోని క్యూట్‌నెస్ చూసి ఎవరైనా మురిసిపోవాల్సిందే.
మనవరాలి డ్యాన్స్‌కు తాతయ్య ఫిదా
అయితే ఈ వీడియోలో అసలైన స్పెషల్ అట్రాక్షన్ మాత్రం చిన్నారి తాతయ్యే! ఓ చిన్న మంట పక్కన కూర్చున్న ఆయన మనవరాలి డ్యాన్స్‌ను ఎంతో ఆసక్తిగా చూస్తూ ఎంజాయ్ చేశారు. అంతటితో ఆగకుండా తానూ పాటకు అనుగుణంగా కదులుతూ సందడి చేశారు. మనవరాలు పాట పాడుతూ డ్యాన్స్ చేస్తుంటే తాతయ్య ఆమెను ప్రోత్సహిస్తూ ఆనందంగా గడిపారు. ఎలాంటి హడావుడి, ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా సహజంగా సాగిన ఈ చిన్న క్షణాలే వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
5.5 కోట్ల వ్యూస్.. మనసులు గెలుచుకున్న వీడియో
ఇవా అనా మారియా జార్జియాలో ఉంటూ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వివిధ భాషల్లోని పాటలకు డ్యాన్స్ చేస్తూ, లిప్‌సింక్ వీడియోలు చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా భారతీయ ప్రేక్షకులకు ఆమె వీడియోలు బాగా నచ్చుతున్నాయి. తాజాగా షేర్ చేసిన ఈ డ్యాన్స్ వీడియోకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే దాదాపు 5.5 కోట్ల వ్యూస్, 50 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 90 వేలకు పైగా కామెంట్లతో ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
View this post on Instagram
తాతయ్య కళ్లలో ప్రేమ.. నెటిజన్ల కామెంట్ల వర్షం
ఈ వీడియో చూసిన నెటిజన్లు చిన్నారి డ్యాన్స్‌ను మాత్రమే కాదు తాతయ్యతో ఆమెకున్న అనుబంధాన్ని కూడా తెగ మెచ్చుకుంటున్నారు. ‘నువ్వు ఇన్ని భాషల్లో పాటలు పాడుతూ డ్యాన్స్ చేయడం చాలా బాగుంది. నీ వీడియోలు చూస్తే రోజంతా సంతోషంగా ఉంటుంది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ, ‘తాతయ్య తన జీవితంలోని అత్యంత అందమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. రిటైర్మెంట్ జీవితాన్ని ఇంత ఆనందంగా గడపడం చూస్తుంటే ముచ్చటేస్తోంది’ అని రాశారు. ఇంకొకరు ‘మనవరాలిపై తాతయ్యకు ఉన్న ప్రేమ ఆయన కళ్లలోనే కనిపిస్తోంది. ఆ చూపు వెలకట్టలేనిది’ అంటూ ప్రశంసించారు. మరికొందరు అయితే ‘నిజమైన సింగర్ తాతయ్యే’, ‘ఓ లి సజా కే రఖ్నా.. అబ్బా ఎంత క్యూట్‌గా ఉంది!’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
30 ఏళ్లు దాటినా తగ్గని DDLJ క్రేజ్
1995లో విడుదలైన ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాకు ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించారు. షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా ‘మెహందీ లగా కే రఖ్నా’ పాట ఇప్పటికీ భారతీయ పెళ్లిళ్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దాదాపు మూడు దశాబ్దాలు గడిచినా ఈ పాట క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు జార్జియా చిన్నారి తన తాతయ్యతో కలిసి ఈ పాటకు చేసిన సందడి మరోసారి ఆ పాటను సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మార్చింది. నిజంగా సంగీతానికి హద్దులు లేవని ఈ వీడియో మరోసారి నిరూపిస్తోంది!
మరిన్ని ట్రెండింగ్ వార్తలు చూడండి

