REDMAGIC 11S Pro: గేమింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ REDMAGIC కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2026 PUBG MOBILE Global Championship (PMGC) టోర్నమెంట్‌కు అధికారిక గేమింగ్ ఫోన్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ భాగస్వామ్యంతో అంతర్జాతీయ ఈస్పోర్ట్స్ రంగంలో తన ప్రస్థానాన్ని మరింత పెంచుకునేందుకు కంపెనీ మాస్టర్ ప్లాన్ చేసింది. చైనాలో ప్రారంభమైన తన గేమింగ్ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమర్లకు పరిచయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.
KRAFTON, Level Infinite సంయుక్తంగా నిర్వహిస్తున్న 2026 PMGCలో ప్రపంచవ్యాప్తంగా 39 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 30 లక్షల అమెరికన్ డాలర్ల ప్రైజ్ పూల్ కోసం జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నమెంట్ గ్రాండ్ ఫైనల్స్ డిసెంబర్ 11 నుంచి 13 వరకు టర్కీలోని ఇస్తాంబుల్‌లో Turkcell Basketbol Gelişim Merkezi వేదికగా జరగనున్నాయి. ఇందులో అర్హత సాధించిన 16 జట్లు ఛాంపియన్షిప్ టైటిల్ కోసం తలపడతాయి. మూడు రోజుల పాటు ప్రతిరోజూ ఆరు మ్యాచ్‌లు చొప్పున మొత్తం 18 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. చివరి రోజు విజేతను అధికారికంగా ప్రకటిస్తారు.
ఈ టోర్నీలో భాగంగా REDMAGIC 11S Pro స్మార్ట్‌ఫోన్‌ను ప్రధాన గేమింగ్ డివైజ్‌గా ప్రమోట్ చేయనున్నారు. ఇందులో Qualcomm Snapdragon 8 Elite Gen 5 లీడింగ్ వెర్షన్ ప్రాసెసర్‌తో పాటు కంపెనీ సొంత RedCore R4 గేమింగ్ చిప్‌ను అందించారు. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు AquaCore కూలింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. ఇందులో లిక్విడ్ కూలింగ్, 13,116 చదరపు మిల్లీమీటర్ల 3D వేపర్ ఛాంబర్, కంపోజిట్ లిక్విడ్ మెటల్ 3.0 టెక్నాలజీతో పాటు 24,000 RPM టర్బో ఫ్యాన్ ఉన్నాయి.
ఈ REDMAGIC 11S Proలో 6.85 అంగుళాల BOE X10 AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 3,000Hz ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ కోసం 520Hz కెపాసిటివ్ షోల్డర్ ట్రిగ్గర్లను కూడా ఇచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే 7,500mAh సామర్థ్యంతో పాటు 80W వైర్డ్, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇదిలా ఉండగా, REDMAGIC తన తదుపరి స్మార్ట్‌ఫోన్ REDMAGIC 12 Pro మార్కెట్ విడుదలను కూడా ప్రకటించింది. ఈ కొత్త మోడల్లోనూ మెరుగైన హార్డ్‌వేర్, కంపెనీ సొంత కూలింగ్ టెక్నాలజీలపై దృష్టి పెట్టింది.

