Sree Vishnu About 2027 Sankranti Films Competition: టాలీవుడ్ క్రేజీ హీరో శ్రీవిష్ణు సంక్రాంతి బరిలో ఉన్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ ప్యాక్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. సాక్షి మడోల్కర్‌ కథానాయికగా నటిస్తుండగా.. నరేశ్, మురళీ శర్మ, అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్‌ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొంది.

ఈ సందర్భంగా సంక్రాంతి సినిమాల పోటీ గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు శ్రీవిష్ణు ఆసక్తికరంగా స్పందించారు. ఈ సంక్రాంతికి పలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు విడుదలవుతున్న నేపథ్యంలో పోటీని ఎలా చూస్తున్నారని ప్రశ్నించగా.. అవన్నీ పెద్ద సినిమాలని, వాటితో తమకు అసలు పోటీ లేదని చెప్పాడు.’అవన్నీ పెద్ద సినిమాలు. మేము అసలు పోటీలోనే లేము. ఈ సంక్రాంతికి మాకు ఓ స్పేస్ దొరికింది. అందుకే జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. సినిమా ఫస్టాఫ్‌ను యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాలో యాక్షన్ కూడా ఉంటుంది. అయితే అది కేవలం డైలాగ్స్‌తోనే ఉంటుంది’ అంటూ శ్రీవిష్ణు నవ్వులు పూయించారు.

ఈ సంక్రాంతి తనకు చాలా ప్రత్యేకమని శ్రీవిష్ణు చెప్పారు. ‘నేను వెంకీ సర్ అభిమానిని. ఆయన సినిమాతో పాటు నా సినిమా కూడా సంక్రాంతికి విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు స్పెషల్ సంక్రాంతి. ఫ్యామిలీ ప్యాక్‌ వెంకటేష్ గారి అభిమానులకు మరింత బాగా నచ్చుతుంది’ అని చెప్పారు. ఫ్యామిలీ ప్యాక్‌ వైవిధ్యభరితమైన కథతో రూపొందిన సినిమా అని చెప్పారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లోనే ఓ కొత్త కోణాన్ని చూపించబోతున్నామని, ఆ ప్రత్యేక అంశం టీజర్ లేదా ట్రైలర్‌లో లేదని, దాన్ని థియేటర్లలోనే చూసి అనుభూతి చెందాలని చెప్పారు. సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని, ఇందులోని పాత్రలన్నీ విభిన్నంగా ఉంటాయని, వాటిని ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారని శ్రీవిష్ణు చెప్పుకొచ్చారు. విక్టరీ వెంకటేష్ నటించిన ‘జనవరి 12 విడుదల’ మూవీ జనవరి 12కి రిలీజ్ అవుతుంది. వెంకీకి శ్రీవిష్ణు పెద్ద ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే.