ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 సర్వీసెస్ కింద మొత్తం 686 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థుల నుంచి నవంబర్ 10, 2026 నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 30, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహశీల్దార్, డిప్యూటీ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్, జీఎస్టీ ఆఫీసర్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి నెల జీతం రూ.25,220 నుంచి రూ.1,30,580 వరకు ఉంటుంది. APPSC గ్రూప్-2 నోటిఫికేషన్లో పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
పోస్టుల వివరాలు..
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III పోస్టుల సంఖ్య: 06
- సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-II పోస్టుల సంఖ్య: 07
- డిప్యూటీ తహశీల్దార్ పోస్టుల సంఖ్య: 200
- గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ (GSTN/ACTO) పోస్టుల సంఖ్య: 40
- కోఆపరేటివ్ సొసైటీల అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల సంఖ్య: 10
- డిప్యూటీ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 176
- ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ పోస్టుల సంఖ్య: 29
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD) పోస్టుల సంఖ్య: 71
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్ డిపార్ట్మెంట్) పోస్టుల సంఖ్య: 05
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా డిపార్ట్మెంట్) పోస్టుల సంఖ్య: 04
- సీనియర్ అకౌంటెంట్ పోస్టుల సంఖ్య: 90
- జూనియర్ అకౌంటెంట్ పోస్టుల సంఖ్య: 48
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అయితే కొన్ని పోస్టులకు ప్రత్యేక విద్యార్హతలు తప్పనిసరి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా డిపార్ట్మెంట్) పోస్టుకు లా డిగ్రీ ఉండాలి. సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్) పోస్టులకు గణితం, అర్థశాస్త్రం లేదా వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ అవసరం. అకౌంటింగ్ పోస్టులకు కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సులు లేదా కంప్యూటర్ సైన్స్ డిగ్రీలకు సంబంధించిన నిబంధనలు వర్తిస్తాయి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 30, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వారీగా జీతభత్యాలు
- మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III పోస్టులకు నెలకు జీతం: రూ.45,830 – 1,30,580
- సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-II పోస్టులకు నెలకు జీతం: రూ.44,570 – 1,27,480
- డిప్యూటీ తహశీల్దార్ పోస్టులకు నెలకు జీతం: రూ.44,570 – 1,27,480
- జీఎస్టీ ఆఫీసర్ పోస్టులకు నెలకు జీతం: రూ.45,830 – 1,30,580
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులకు నెలకు జీతం: రూ.45,830 – 1,30,580
- డిప్యూటీ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు నెలకు జీతం: రూ.45,830 – 1,30,580
- సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు నెలకు జీతం: రూ.34,580 – 1,07,210
- జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు నెలకు జీతం: రూ.25,220 – 80,910
- ఇతర పోస్టులకు పోస్టులకు నెలకు జీతం: రూ.40,970 – 1,24,380
ఎంపిక విధానం ఇలా..
APPSC గ్రూప్-2 ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా రెండు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష: స్క్రీనింగ్ టెస్ట్‌ను ఆఫ్‌లైన్ విధానంలో OMR ఆధారంగా నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష: ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT): నిబంధనల ప్రకారం కొన్ని పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి నిర్దేశించిన మార్కుల్లో 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సమాధానాలు గుర్తించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. 686 పోస్టులతో విడుదలైన APPSC గ్రూప్-2 నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న డిగ్రీ అభ్యర్థులకు మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 10, 2026
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30, 2026
APPSC గ్రూప్ 2 పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

