ఈ వేడుకల్లో భారతీయ టెక్ వ్యాపారవేత్త, GOQii సంస్థ వ్యవస్థాపకుడు విశాల్ గోండాల్ ట్రంప్‌కు హనుమాన్ చాలీసా ప్రతిని బహూకరించారు. అనంతరం ట్రంప్‌తో కలిసి సంప్రదాయబద్ధంగా దీపాలు వెలిగించారు. ఈ వివరాలను విశాల్ గోండాల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకున్నారు. ఓవల్ ఆఫీస్‌లో అమెరికా అధ్యక్షుడితో కలిసి దీపావళి జరుపుకోవడం తనకు ఎంతో గౌరవంగా ఉందని, కోట్లాది మంది భక్తితో పఠించే తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా ప్రతిని ట్రంప్‌కు అందించడం సంతోషంగా ఉందన్నారు.
ధైర్యం, భక్తి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా హనుమాన్ చాలీసాను అభివర్ణించారు. దీపాలు వెలిగించే సమయంలో భారత్, అమెరికా మధ్య స్నేహబంధం మరింత బలపడాలని తాను ప్రార్థించినట్లు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించే విజయానికి దీపావళి ప్రతీక అని తెలిపారు. ఈ సందర్భంగా ‘జుగ్ జుగ్ జియో’ అనే భారతీయ ఆశీర్వాదాన్ని ప్రస్తావించారు. అంటే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని అర్థం. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ శాంతి, సౌభాగ్యం, మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.
A moment of shared light in the Oval Office.
Honored to celebrate Diwali with President @realDonaldTrump and proud to gift him with a copy of the Hanuman Chalisa, Tulsidas’s hymn to Lord Hanuman that millions of us recite for courage, devotion and strength.
As the diyas were lit, my prayer was for friendship between India and America, and for the triumph of light over darkness.
Jug Jug Jiyo, a blessing many of us grew up hearing, means “may you live for ages.” It is the wish behind everything I do, and today I made it for everyone around the world: peace, prosperity, good health and longevity.
Happy Diwali. Jug Jug Jiyo.
@TheVikasKhanna @DhallaRuby @WhiteHouse
— Vishal Gondal (@vishalgondal) November 6, 2026
వైట్‌హౌస్‌లో దీపావళి ఎప్పటి నుంచి
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించే సంప్రదాయం ఇప్పటిది కాదు. 2003లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. తొలినాళ్లలో వైట్‌హౌస్‌కు సమీపంలోని ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్‌లో ఈ వేడుకలు జరిగేవి. భారతీయ అమెరికన్లు, భారత దౌత్యవేత్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మరో అడుగు ముందుకేసి వైట్‌హౌస్‌లోనే తొలిసారిగా దీపం వెలిగించారు. ఈస్ట్ రూమ్‌లో జరిగిన ఆ కార్యక్రమం ప్రత్యేక గుర్తింపు పొందింది. అప్పటి నుంచి వైట్‌హౌస్‌లోని వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఓవల్ ఆఫీస్, రూజ్వెల్ట్ రూమ్‌లలోనూ దీపాలు వెలిగించారు.
ప్రముఖుల సందడి
ఈసారి ట్రంప్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాత మిచెలిన్ స్టార్ చెఫ్ వికాస్ ఖన్నా, కెనడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు రూబీ ధల్లా సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ అమెరికా అధ్యక్షుడి కార్యాలయంలో జరగడం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహూకరించడం ఈ వేడుకల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తలు చూడండి



