Samantha : సమంత పండంటి బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సమంత – రాజ్ నిడిమోరు 2025 లో పెళ్లి చేసుకోగా నవంబర్ 19న బాబుకి జన్మనిచ్చి తల్లయింది. తన బాబుకి దేవ్ అని పేరు పెట్టినట్టు కూడా ప్రకటించింది. అయితే సమంతకు మొదట కొడుకే పుడతాడు అని చెప్పిన జోస్యం ఇప్పుడు వైరల్ గా మారింది.

2014 సమంత యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసిన కొంచెం టచ్ లో ఉంటె చెప్తాను షోకి గెస్ట్ గా వచ్చింది. ఆ షోలో ఓ పండితుడు వచ్చి సమంతకు జోస్యం చెప్పాడు. అందులో.. సమంతకు ఇద్దరు సంతానం కలుగుతారు. తొలి సంతానం కొడుకు పుడతారు అని చెప్పాడు. అంటే ఇంకొకరు భవిష్యత్తులో పాప పుడతారని అంతా భావిస్తున్నారు. 12 ఏళ్ళ క్రితం చెప్పిన ఈ జోస్యం ఇప్పుడు సమంత బాబుకి జన్మనిచ్చాక వైరల్ గా మారింది.

Also Read : ENE Repeat : ఆర్జీవీ జస్ట్ మిస్.. ఆ డైరెక్టర్స్‌తో ఆయన కూడా ఉండుంటే వేరే లెవల్.. తరుణ్ భాస్కర్ ఏం చెప్పాడంటే..

View this post on Instagram

A post shared by Zee Telugu (@zeetelugu)