Venky Atluri : ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టినా తర్వాత రెండు సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. కానీ సర్, లక్కీ భాస్కర్, విశ్వనాధ్ & సన్స్ సినిమాలతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. అయితే ఈ మూడు వేరే భాష హీరోలతో చేసినా సినిమాలు. ధనుష్, దుల్కర్ సల్మాన్, సూర్య లతో సినిమాలు చేసాడు.

ఎవరితో చేసిన మంచి కథలతో హిట్స్ కొడుతున్నాడు. కానీ కొంతమంది తెలుగు డైరెక్టర్ అయి ఉండి వేరే భాష హీరోలతోనే వరుస సినిమాలు చేస్తున్నారెందుకు, తెలుగు హీరోలతో సినిమాలు చేయరా అని విమర్శిస్తున్నారు. అయితే ఈ సారి అలాంటి విమర్శలకు కౌంటర్ ఇచ్చేలాగా వెంకీ అట్లూరి తెలుగు హీరోతోనే సినిమా ప్లాన్ చేయాలనుకుంటున్నాడట.

Also Read : Ram Charan : మళ్ళీ శరీరంపై ఫోకస్ చేసిన రామ్ చరణ్.. సినిమా పాత్ర కోసం కష్టం..

తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం వెంకీ అట్లూరి నాని లేదా విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే నాని, విజయ్ ని కలిసి కథ బేసిక్ లైన్ చెప్పాడంట. ఇంకా పూర్తి నేరేషన్ అవ్వలేదు. ఈ ఇద్దరిలో ఎవరు కథ ఒకే చేసినా వాళ్ళతో సినిమా చేయడానికి వెంకీ సిద్ధమయ్యాడని తెలుస్తుంది. విజయ్, నాని లలో ఏ హీరో వెంకీ అట్లూరి ఛాన్స్ ఇస్తారో చూడాలి. లేదా ఈ ఇద్దరు హీరోలు కాకుండా ఎప్పట్లాగే వేరే భాష హీరోలతో సినిమా చేసి వెంకీ అట్లూరి సక్సెస్ కొడతాడా చూడాలి.