Anirudh & Kavya Maran Wedding Reception: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ వేడుకలు సినీ, రాజకీయ, క్రీడా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ జంట నవంబర్ 11న గ్రీస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఇక నేడు నవంబర్ 21న చెన్నైలో జరగనున్న వీరి వివాహ రిసెప్షన్‌కు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిస్తున్నారు.
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆ జట్టు మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ, దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ తన కుటుంబంతో కలిసి చెన్నైకి చేరుకున్నారు. అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన కుటుంబంతో సహా చెన్నైకి చేరుకున్నారు. వీరు విమానాశ్రయానికి వచ్చిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక నవంబర్ 11న గ్రీస్‌లో జరిగిన వివాహ వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ప్రత్యేకమైన సెల్ఫ్-రెస్పెక్ట్ వివాహ పద్ధతిలో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి. సినిమా, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేడుకలో కలవడంతో అనిరుధ్-కావ్య మారన్ వివాహ రిసెప్షన్పై భారీ ఆసక్తి నెలకొంది.
Kane Williamson & Daniel Vettori has arrived in Chennai for Kaviya & Anirudh wedding reception
https://t.co/H8zLqIhAyi
— Johns. (@CricCrazyJohns) November 20, 2026
Mahesh Babu arrived in Chennai to attend Kaviya Kalainidhi Maran – Anirudh Ravichander wedding reception.
https://t.co/eStAO5ClzC
— Nikki (@ssmbbakthudu) November 20, 2026



https://t.co/H8zLqIhAyi
https://t.co/eStAO5ClzC