Redmi R80 5G, R80m 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Xiaomi Redmi బ్రాండ్ నుంచి మరో రెండు కొత్త 5G స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. Redmi R80 5G, Redmi R80m 5G పేర్లతో రాబోతున్న ఈ ఫోన్లు ఇప్పటికే చైనాకు చెందిన Xiaomi Mall వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యాయి. ఈ లిస్టింగ్ ద్వారా ఫోన్ల ధరలు, కలర్ ఆప్షన్లు, RAM, స్టోరేజ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో 6,000mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.9 అంగుళాల డిస్‌ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Xiaomi Mall China వెబ్‌సైట్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు లిస్ట్ అయ్యాయి. అందులో వెల్లడైన వివరాల ప్రకారం Redmi R80 5G మూడు వేరియంట్లలో, Redmi R80m 5G రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నాయి.

Redmi R80 5G ధరలు

4GB RAM + 128GB స్టోరేజ్: 1,899 యువాన్లు (సుమారు రూ.24,000)
6GB RAM + 128GB స్టోరేజ్: 2,199 యువాన్లు (సుమారు రూ.28,000)
6GB RAM + 256GB స్టోరేజ్: 2,599 యువాన్లు (సుమారు రూ.34,000)

Redmi R80m 5G ధరలు:

6GB RAM + 128GB స్టోరేజ్: 2,199 యువాన్లు (సుమారు రూ.28,000)
6GB RAM + 256GB స్టోరేజ్: 2,599 యువాన్లు (సుమారు రూ.36,130)

ఈ ఫోన్లు Phoenix Feather White, Black, Leather Brown, Flowing Clouds Blue వంటి కలర్ ఆప్షన్లలో లభించనున్నాయి. అయితే వీటి అధికారిక సేల్ తేదీని Xiaomi ఇంకా వెల్లడించలేదు. Redmi R80 5G, Redmi R80m 5G రెండు ఫోన్లలోనూ 6.9 అంగుళాల LCD HD+ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ స్క్రీన్ 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. ఇందులో 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ ఉంటుంది. దీంతో స్క్రోలింగ్, సాధారణ వినియోగం, గేమింగ్ సమయంలో మెరుగైన స్క్రీన్ అనుభవం లభించనుంది.

పనితీరు విషయానికి వస్తే ఈ రెండు Redmi 5G స్మార్ట్‌ఫోన్లలో MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌ను అందించనున్నారు. ఈ ప్రాసెసర్ 5G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీని ఉపయోగించారు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే రెండు ఫోన్లు Xiaomi HyperOS 3 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనున్నాయి. కెమెరా విభాగంలో Redmi R80 5G, Redmi R80m 5G రెండు ఫోన్లలోనూ 13MP ప్రైమరీ రియర్ కెమెరాను అందించనున్నారు.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఉంటుంది. కెమెరా ఫీచర్ల విషయంలో ఇవి బేసిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన స్మార్ట్‌ఫోన్లుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు ఫోన్లలోనూ 6,000mAh భారీ బ్యాటరీని అందించనున్నారు. దీనికి 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం Redmi R80 5G, Redmi R80m 5G స్మార్ట్‌ఫోన్లు చైనా వెబ్‌సైట్‌లో మాత్రమే లిస్ట్ అయ్యాయి. వీటి అధికారిక లాంచ్ తేదీ, సేల్ వివరాలను Xiaomi ఇంకా ప్రకటించలేదు.