BCCI Rohit Kohli Update: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. పరుగుల కోసం ఇద్దరు సీనియర్లు తీవ్రంగా శ్రమించారు. దీంతో వారి స్థానాలపై ప్రశ్నలు మొదలయ్యాయి. ICC వన్డే వరల్డ్ కప్ 2027కు వీరు దూరమవుతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే తాజా రిపోర్ట్ ఈ పుకార్లకు బ్రేక్ వేస్తూ వరల్డ్ కప్‌లో వారి పాత్రపై పెద్ద అప్డేట్ ఇచ్చింది.
రోహిత్-విరాట్ టికెట్ కన్ఫర్మా?
న్యూజిలాండ్ పర్యటనలో కోహ్లీ, రోహిత్ విఫలం కావడం అందరినీ నిరాశపరిచింది. కివీస్‌పై ఈ దిగ్గజాలు చెలరేగుతారని భావించినా అది జరగలేదు. దీంతో వన్డే వరల్డ్ కప్ 2027 జట్టు నుంచి వారిని తప్పిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఓ మీడియా రిపోర్ట్ ఈ అంచనాలకు కొత్త మలుపు ఇచ్చింది.
బీసీసీఐ గ్రీన్ సిగ్నల్..
దక్షిణాఫ్రికాలో జరగనున్న ICC వన్డే వరల్డ్ కప్ 2027లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండటానికి BCCI పెద్ద అధికారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దైనిక్ జాగరణ్ పేర్కొంది. ఆ అధికారి మాట్లాడుతూ.. “దక్షిణాఫ్రికాలో రోహిత్, విరాట్ అవసరం. వారు లేకుండా మనం అక్కడ గెలవలేం. అక్కడ అనుభవం పని చేస్తుంది” అని చెప్పినట్లు సమాచారం.
నిజానికి న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు BCCI అధికారి ఒకరు రోహిత్ వరల్డ్ కప్ అవకాశం అతడి ఫామ్‌పై ఆధారపడుతుందని అన్నారు. కానీ ఇప్పుడు బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వారే లెజెండ్స్ అన్న బీసీసీఐ..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని లెజెండ్స్‌గా అభివర్ణించిన బీసీసీఐ అధికారి, సౌతాఫ్రికా కఠిన పిచ్‌లపై వారి అనుభవం టీమిండియాకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
“వీరిద్దరూ లెజెండ్స్. ఎంతకాలం ఆడాలనేది వారే నిర్ణయిస్తారు. 2027 వరల్డ్ కప్ ప్రచారంలో వారి అవసరం మాకు ఉంటుందని భావిస్తున్నా. దక్షిణాఫ్రికా కఠిన పిచ్‌లపై వారు కీలకంగా మారతారు. అక్కడ వారి అనుభవం మాకు ఎంతో పని చేస్తుంది” అని అతడు వ్యాఖ్యానించినట్లు రిపోర్ట్ తెలిపింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

