AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల వేలం పాటలు.. చీటీలు.. తాను గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ కొందరు ముందుకు వచ్చి.. డబ్బులు ప్రకటించి.. ఏకగ్రీవంగా సర్పంచ్ పదవులు దక్కించుకుంటున్నారు.. ఇక, గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చక్రాయపాలెం సర్పంచ్ పదవిని 51 లక్షల రూపాయలకు జనసేన నేత నాగేశ్వరరావు దక్కించుకున్నారు. అయితే, చక్రాయపాలెం సర్పంచ్ పదవి కోసం గ్రామంలో ముగ్గురు పోటీపడ్డారు. దీంతో తెనాలి మున్సిపల్ ఛైర్మన్ రమణారావుతోపాటు గ్రామపెద్దలు సమావేశమయ్యారు. గ్రామంలో రామాలయం పునః నిర్మాణంతోపాటు శివాలయం, గంగానమ్మ తల్లి, ఆంజనేయస్వామి ఆలయాల మరమ్మత్తులు చెయ్యాలని తీర్మానించారు. గ్రామానికి చెందిన అడపాల నాగేశ్వరరావు రూ.51 లక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. పోటీలో ఉన్న మిగతా ఇద్దరు సర్పంచ్ పదవికి పోటీలో నిల్చోకుండా సహకరించేందుకు అంగీకరించారు. అనంతరం నేతలందరూ మంత్రి మనోహర్ ను కలిశారు. నాగేశ్వరరావును మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి గ్రామాభివృద్ధి కోసం పనిచెయ్యాలని సూచించారు. మొత్తంగా రూ.51 లక్షలతో చక్రాయపాలెం సర్పంచ్ పదవి దక్కించుకున్నారు జనసేన నేత నాగేశ్వరరావు..
జాతీయం
AP Panchayat Elections: సర్పంచ్ పదవికి రూ.51 లక్షలు.. దక్కించుకున్న జనసేన నేత

ఈ కంటెంట్‌ను NTV Telugu - Andhra Pradesh ప్రచురించింది; IB9TV దీనిని రాయలేదు, ఎడిట్ చేయలేదు. అసలు వార్త చూడండి
