Geetha Bhascker : దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోయిన్ ఈషా రెబ్బ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా రూమర్స్ వచ్చినా ఇటీవల వినాయకచవితి నాడు తరుణ్ అధికారికంగా ఈషాతో దిగిన ఫోటో షేర్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారు.
తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ నవంబర్ 19న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్లో తరుణ్ తల్లి, నటి గీతా భాస్కర్ ఈషారెబ్బ గురించి, తన కొడుకు తరుణ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
Also Read : Anshu Selvamani : రోజా బర్త్ డే.. స్పెషల్ పాత ఫోటోలు షేర్ చేసిన కూతురు అన్షు సెల్వమణి..
గీతా భాస్కర్ మాట్లాడుతూ.. తరుణ్ గత రెండేళ్లుగా చాలా ఇబ్బందులు పడ్డాడు. కోర్టు కేసులు, ఇల్లు కట్టడం.. ఇలా చాలా అయ్యాయి. ఇంటికి రాని రోజులు కూడా చాలా ఉన్నాయి. ఇంటికి వచ్చినా అర్ధరాత్రి వచ్చి తినేవాడు. కానీ అలాంటి సమయంలో ఒక్క వ్యక్తి తనకు తోడుగా ఉంది. తన ఫ్రెండ్, తన సోల్, తన సపోర్ట్, తన ఫ్యామిలీ ఈషా ఉంది. అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది. నాకు వయసైపోతుంది. వాడి పక్కన ఎవరో ఒకరు ఉండాలి అనుకున్నాను. ఫ్రెండ్ తో కూడా అన్ని చెప్పుకోలేము. కచ్చితంగా ఒక పార్టనర్ కావాలి. ఒక సోల్ మెట్ ఉండాలి. నేను చాలా ఆనందంగా ఉన్నాను తన విషయంలో. థ్యాంక్యూ ఈషా. ఇవాళ తాను రాలేదు. తరుణ్ కి అద్భుతమైన సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్యూ సో మచ్ ఈషా అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.

