ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) కీలక మార్పులు చేపట్టింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను జట్టు నుంచి విడుదల చేసింది. ఐపీఎల్ 2025 వేలానికి ముందు రూ.14 కోట్లకు హెడ్‌ను రిటైన్ చేసుకోగా.. గత మూడు సీజన్లుగా ఎస్ఆర్‌హెచ్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగాడు. అయితే ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉండటంతో పాటు కుటుంబానికి సమయం కేటాయించేందుకు మెరుగైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటున్న అతడు.. ఐపీఎల్ 2027లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీకి తెలియజేయడంతో హెడ్‌ను విడుదల చేసింది.

హెడ్‌తో పాటు పలువురు విదేశీ, భారత ఆటగాళ్లకు కూడా ఎస్ఆర్‌హెచ్ వీడ్కోలు పలికింది. జెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ పేన్, జయదేవ్ ఉనద్కట్, శివమ్ మావి, కమీందు మెండిస్, దిల్షాన్ మదుశంక, ఓంకార్ టర్మలే, అమిత్ కుమార్‌లను విడుదల చేసింది. వీరితో పాటు హర్షల్ పటేల్, జీషాన్ అన్సారీ, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను ట్రేడ్ల ద్వారా వేరే జట్లకు పంపించింది. మరోవైపు ఎస్ఆర్‌హెచ్ తన ప్రధాన ఆటగాళ్లను మాత్రం కొనసాగించింది. కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, బ్రైడన్ కార్స్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, స్మరన్ రవిచంద్రన్‌లను అట్టిపెట్టుకుంది. అలాగే ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్, క్రాన్స్ ఫులేట్రా, ఈషాన్ మలింగ కూడా జట్టులో కొనసాగనున్నారు.

ట్రేడ్ల ద్వారా టీ. నటరాజన్, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను సన్‌రైజర్స్ తమ జట్టులోకి తీసుకుంది. దీంతో బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఆ జట్టుకు లభించింది. ఐపీఎల్ 2027 వేలానికి ముందు సన్‌రైజర్స్ వద్ద రూ.40.15 కోట్ల పర్స్ మిగిలి ఉంది. మొత్తం ఏడు ఆటగాళ్ల స్థానాలు ఖాళీగా ఉండగా.. వాటిలో మూడు విదేశీ ఆటగాళ్లకు కేటాయించవచ్చు. డిసెంబర్ 16న జరగనున్న వేలంలో ఈ మొత్తంతో జట్టులోని ఖాళీలను భర్తీ చేసుకోవాలని ఎస్ఆర్‌హెచ్ భావిస్తోంది. హెడ్ వంటి కీలక ఆటగాడు దూరమైన నేపథ్యంలో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

ఎస్ఆర్‌హెచ్ రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్స్ వివరాలు:
రిలీజ్ ప్లేయర్స్: ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు), జెరాల్డ్ కోయెట్జీ (రూ.2 కోట్లు), డేవిడ్ పేన్ (రూ.1.5 కోట్లు), జయదేవ్ ఉనద్కట్ (రూ.1 కోటి), శివమ్ మావి (రూ.75 లక్షలు), కమీందు మెండిస్ (రూ.75 లక్షలు), దిల్షాన్ మదుశంక (రూ.75 లక్షలు), ఓంకార్ టర్మలే (రూ.30 లక్షలు), అమిత్ కుమార్ (రూ.30 లక్షలు).

ట్రేడ్ ద్వారా విడుదలైనవారు: హర్షల్ పటేల్, జీషాన్ అన్సారీ, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్.

రిటెన్షన్ ప్లేయర్స్: పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, బ్రైడన్ కార్స్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, స్మరన్ రవిచంద్రన్, ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్, క్రాన్స్ ఫులేట్రా, ఈషాన్ మలింగ.

ట్రేడ్ ద్వారా జట్టులోకి వచ్చినవారు: టీ. నటరాజన్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్.

మిగిలిన పర్స్: రూ.40.15 కోట్లు
ఖాళీగా ఉన్న స్థానాలు: 7 (విదేశీ ఆటగాళ్లకు 3)