జీర్ణక్రియ మెరుగుదల, గ్యాస్ సమస్యలకు చెక్: సోంపు గింజల్లో ఎన్జైమ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులోని గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఇట్టే తగ్గిస్తాయి. రోజూ ఉదయం పరగడుపున గ్లాసు సోంపు నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.

Fennel Seeds

బరువు తగ్గాలనుకునే వారికి దివ్యౌషధం: శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గాలనుకునేవారికి సోంపు నీరు ఒక అద్భుతమైన సహజ పానీయం. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా, కడుపు నిండిన భావనాన్ని కలిగించి పదే పదే ఆహారం తినాలనే కోరికను తగ్గిస్తుంది.

Fennel Seeds

కాంతివంతమైన చర్మం: మలినాలు, టాక్సిన్స్ కారణంగా చర్మం నిర్జీవంగా మారుతుంది. సోంపు నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల మొటిమలు, మచ్చలు తగ్గి ముఖం పై సహజమైన కాంతి వస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.

Fennel Seeds

జుట్టు రాలడం తగ్గి కుదుళ్లు బలంగా.. సోంపులో ఉండే ఖనిజాలు, పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. తలలో చుండ్రు సమస్యను నివారించడంలోనూ సోంపు నీరు చక్కగా పనిచేస్తుంది.

Fennel Seeds

తయారీ విధానం చాలా సులభం: రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ సోంపు గింజలను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి పరగడుపున తాగాలి. కావాలనుకుంటే సోంపును నీళ్లలో మరిగించి, గోరువెచ్చగా కూడా తీసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ సహజ సిద్ధమైన సోంపు నీటిని మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మీ ఆరోగ్యంలో, చర్మంలో అద్భుతమైన మార్పులను మీరే గమనించవచ్చు.