Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్టులపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్, తరుణ్ మూర్తి, సందీప్ రెడ్డి వంగా, బుచ్చిబాబు సానా.. ఈ నలుగురు దర్శకులతో చిరంజీవి తదుపరి సినిమాలపై డిస్కషన్స్ నడుస్తున్నట్లు టాక్.

విభిన్నమైన కథలు, వైవిధ్యమైన మేకింగ్ స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులతో మెగాస్టార్ కాంబినేషన్ కుదిరితే ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ లభించే అవకాశం ఉందనే ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి. యాక్షన్, ఎమోషన్, బలమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుల వైపు చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

Nainika : డ్యాన్స‌ర్ నైనిక దీపావ‌ళి స్పెష‌ల్ ఫోటోలు.. వైర‌ల్‌

ఒకవేళ ఈ నలుగురిలో ఏ ఒక్కొక్కరితో ప్రాజెక్టు సెట్ అయినా మెగాస్టార్ కెరీర్‌లో మరో ఇంట్రెస్టింగ్ సినిమా తెరకెక్కడం ఖాయమంటున్నారు. ప్రతి దర్శకుడికీ ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ ఉండటంతో చిరంజీవిని ఏ దర్శకుడు ఏ తరహా పాత్రలో చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

కొత్త తరహా కథలు, భారీ స్థాయి ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నారా.? అన్న చర్చ కూడా మొదలైంది. మొత్తానికి ఈ నలుగురు దర్శకుల పేర్లు చిరంజీవి లైనప్‌లో వినిపిస్తుండటంతో మెగాస్టార్ లైనప్ అదిరింది అంటూ అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు.