IPL 2027 Trade: ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) కీలక ట్రేడ్‌ను పూర్తి చేశాయి. ఈ ట్రేడ్ లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పరస్పరం జట్లు మారారు. ఈ ట్రేడ్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు వెళ్లగా.. అర్ష్‌దీప్ సింగ్ పంజాబ్‌ను వీడి ముంబై ఇండియన్స్‌లో చేరాడు. హార్దిక్ పాండ్యాకి ముంబై ఇండియన్స్ రూ.16.35 కోట్లు చెల్లిస్తుండగా.. ఇప్పుడు రూ.18 కోట్ల ధరకు పంజాబ్ కింగ్స్‌కు వెళ్లనున్నాడు. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ తన ప్రస్తుత రూ.18 కోట్ల ధరతోనే ముంబై జట్టులోకి చేరనున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారిక ప్రకటన వెల్లడించింది.
2015లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన హార్దిక్.. 2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా మారాడు. ఆ జట్టుకు రెండు సీజన్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2024లో తిరిగి ముంబై ఇండియన్స్‌కు చేరి కెప్టెన్సీ బాధ్యతలు కొనసాగించాడు. ఇప్పటివరకు 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. ముంబై తరఫున నాలుగు సార్లు, గుజరాత్ టైటాన్స్‌తో ఒకసారి ట్రోఫీ అందుకున్నాడు. అయితే హార్దిక్ కెప్టెన్సీలో ముంబై 2024లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే 2025లో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 2026 సీజన్లో మాత్రం తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. 2024 నుంచి హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించిన 39 మ్యాచ్‌ల్లో ముంబై 15 విజయాలు సాధించగా, 24 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీనితో ఇప్పుడు ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
The trade confirmation you have been waiting for is HERE!
Two marquee #TeamIndia stars, two franchise and a blockbuster trade
Hardik Pandya heads to @PunjabKingsIPL and Arshdeep Singh moves to @mipaltan.
Hardik will join #PBKS at a revised fee of INR 18 crore, up from 16.5 crores.
Arshdeep will join #MI at his existing fee of INR 18 crore
Details
https://t.co/i4RpaGg2BE
#TATAIPL2027
— IndianPremierLeague (@IPL) November 11, 2026
&
combined… @arshdeepsinghh , hum dande uda denge \!/ https://t.co/tIqasHVcsD
— Mumbai Indians (@mipaltan) November 11, 2026
మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ 2019లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి పంజాబ్ కింగ్స్‌కే ఆడుతూ వచ్చాడు. గడిచిన 8 సీజన్లలో 96 మ్యాచ్‌లు ఆడి 111 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ ఉన్నాడు. ఇప్పుడు ముంబైలో జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. హార్దిక్ నిష్క్రమణతో ముంబై ఇండియన్స్‌లో నాయకత్వం, కోచింగ్ విభాగాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. మహేల జయవర్ధనే స్థానంలో కీరన్ పొలార్డ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. రాబిన్ ఉతప్ప బ్యాటింగ్ కోచ్‌గా, మిచెల్ మెక్క్లెనగన్ బౌలింగ్ కోచ్‌గా, టీ దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఐపీఎల్ 2027కు ముందు ముంబై జట్టు పూర్తిగా కొత్త రూపుతో బరిలోకి దిగనుంది.
Through the highs, the lows, and everything in between, thank you for being a part of the Mumbai Indians story, Hardik.
https://t.co/pUqwrIwebi
— Mumbai Indians (@mipaltan) November 11, 2026
From a young sher to a name that made Punjab proud
You’ll always have a home here, Arsh paa
https://t.co/mndi0tHTWi
— Punjab Kings (@PunjabKingsIPL) November 11, 2026



Hardik will join #PBKS at a revised fee of INR 18 crore, up from 16.5 crores.
https://t.co/i4RpaGg2BE
&
combined… @arshdeepsinghh , hum dande uda denge \!/ https://t.co/tIqasHVcsD
https://t.co/pUqwrIwebi
https://t.co/mndi0tHTWi