CSK Release List 2027: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గత సీజన్‌లో ఘోరంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మాత్రమే సీఎస్‌కే కంటే దిగువన ఉన్నాయి. ఇది సీఎస్‌కే చరిత్రలోనే అత్యంత దారుణ ప్రదర్శన. తొలిసారి వరుసగా మూడు సీజన్లలో (2024, 2025, 2026) ప్లేఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది. దీంతో డిసెంబర్ 16న గోవాలో జరగనున్న ఐపీఎల్ 2027 వేలానికి ముందు జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని యాజమాన్యం భావిస్తోంది.

ఇప్పటికే ట్రేడ్ విండోలో సీఎస్‌కే కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్‌ను జట్టులోకి తీసుకోగా.. ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌ను వదిలేసింది.

ఎక్కువమంది చదివినది: 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ప్రపంచ రికార్డుతో తొలి టీంగా జింబాబ్వే సంచలన రికార్డ్..!

సీఎస్‌కే ప్రస్తుత జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని, సంజూ శాంసన్, సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, ఆయుష్ మాత్రే, శివమ్ దూబే, అమన్ ఖాన్, మాథ్యూ షార్ట్, శ్రేయస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్, జాక్ ఫౌల్క్స్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, రాహుల్ చహర్, మ్యాట్ హెన్రీ, అకీల్ హొసేన్, గుర్జప్‌నీత్ సింగ్, ముఖేష్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్, ఆకాశ్ మధ్వాల్, కుల్దీప్ యాదవ్, డియాన్ ఫారెస్టర్, రామకృష్ణ ఘోష్, మెక్‌నీల్ నోరోన్హా

సీఎస్‌కే విడిచిపెట్టే ఆటగాళ్లు వీరే?

1. ప్రశాంత్ వీర్ – రూ.14.2 కోట్లు: గత వేలంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ యువ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం సీఎస్‌కే ఏకంగా రూ.14.2 కోట్లు ఖర్చు చేసింది. కానీ అతడు 5 ఇన్నింగ్స్‌ల్లో 134.32 స్ట్రైక్‌రేట్‌తో కేవలం 90 పరుగులు మాత్రమే చేశాడు. 6 మ్యాచ్‌ల్లో కేవలం 12 బంతులు మాత్రమే బౌలింగ్ చేశాడంటే అతడిపై టీమ్ మేనేజ్‌మెంట్‌కు నమ్మకం లేకపోయిందని అర్థమవుతోంది. దాదాపు అతడిని రిలీజ్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

2. రాహుల్ చహర్ – రూ.5.2 కోట్లు: భారీ ధర పలికిన రాహుల్ చహర్‌కు ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్‌లోనే అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 11.50 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు, ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో అతడిని కూడా వదిలేయనున్నట్లు సమాచారం.

ఎక్కువమంది చదివినది: Video: 3.2 ఓవర్లలో 7 పరుగులు.. హ్యాట్రిక్‌తోపాటు 6 వికెట్లు.. టీమిండియా బౌలర్ నయా రికార్డ్ గుర్తుందా..?

3. జాక్ ఫౌల్క్స్ – రూ.75 లక్షలు: న్యూజిలాండ్ పేసర్ జాక్ ఫౌల్క్స్‌కు గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. పైగా అతడి స్థానంలోనే లైక్-టు-లైక్ రీప్లేస్‌మెంట్‌గా జాక్ ఎడ్వర్డ్స్ రావడంతో ఫౌల్క్స్‌ను రిలీజ్ చేయడం లాంఛనమే.

4. డియాన్ ఫారెస్టర్ – రూ.75 లక్షలు: జేమీ ఓవర్టన్ స్థానంలో రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన డియాన్ ఫారెస్టర్‌కు ఒక్క అవకాశం కూడా దక్కలేదు. ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో వేలంలో కొత్త వారిని తీసుకోవడానికి అతడిని తప్పించనున్నారు.

సీఎస్‌కే అట్టిపెట్టుకునే ఆటగాళ్లు వీరే?

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్ (విదేశీ), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, ఆయుష్ మాత్రే, శివమ్ దూబే, అమన్ ఖాన్, మాథ్యూ షార్ట్ (విదేశీ), శ్రేయస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ (విదేశీ), అకీల్ హొసేన్ (విదేశీ), గుర్జప్‌నీత్ సింగ్, ముఖేష్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్ (విదేశీ), ఆకాశ్ మధ్వాల్, కుల్దీప్ యాదవ్, రామకృష్ణ ఘోష్, మెక్‌నీల్ నోరోన్హా

కొత్తగా చేరినవారు: లియామ్ లివింగ్‌స్టోన్ (విదేశీ), జాక్ ఎడ్వర్డ్స్ (విదేశీ)

మొత్తానికి కెప్టెన్ రుతురాజ్, ధోని, సంజూ, బ్రెవిస్, దూబే, నూర్ అహ్మద్ వంటి కోర్ టీమ్‌ను అట్టిపెట్టుకుని, విఫలమైన ఖరీదైన ఆటగాళ్లను వదిలి, వేలంలో యువ పేసర్లు, స్పిన్నర్లపై సీఎస్‌కే దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..