ఆరోగ్యానికి బెల్లం కంటే తాటిబెల్లం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. ఒరిజినల్, కల్తీ లేని స్వచ్ఛమైన తాటిబెల్లాన్ని ఎంపిక చేసుకొని వాడగలిగితే, తేనె, ఖర్జూరం, సాధారణ బెల్లం కంటే ఎన్నో రెట్లు లాభాలను పొందవచ్చని నిపుణులు పరిశోధనలు చేసి చెబుతున్నారు . మూడు ముఖ్యమైన పోషకాల విషయంలో తాటిబెల్లం నంబర్ వన్ గా నిలుస్తుంది. అవి: బి1 విటమిన్, బి2 విటమిన్ మరియు ఐరన్. ఈ మూడింటికి ఇతర ఆహారాలు ఏవీ తాటిబెల్లానికి దరిదాపుల్లో కూడా ఉండవు.

Bellam Podi 2

బి కాంప్లెక్స్ విటమిన్లు వాటర్ సాల్యూబుల్ విటమిన్లు, అంటే నీటిలో కరుగుతాయి. మనం ఆహారాన్ని వండేటప్పుడు లేదా ప్రాసెస్ చేసేటప్పుడు ఈ విటమిన్లు నశించిపోయే అవకాశం ఉంటుంది. పాలిష్ పట్టిన ధాన్యాలలో కూడా పై పొరల్లో ఉండే బి1, బి2 విటమిన్లు నశించిపోతాయి. అయితే, తాటిబెల్లంలో ఈ రెండు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. బి1 విటమిన్ (థయామిన్) నరాల బలానికి, నీరసం లేకుండా పని చేసుకోవడానికి, శరీరంలో శక్తి విడుదల కావడానికి అత్యవసరం. బి2 విటమిన్ (రిబోఫ్లేవిన్) నోటి పుండ్లు, అల్సర్స్ రాకుండా నిరోధిస్తుంది. ఇది నరాల, కణాల శక్తి ఉత్పత్తికి కీలకమైనది.

Bellam Podi 3

చాలా మంది నరాలు బలహీనంగా ఉన్నాయని, నిస్సత్తువగా ఉన్నామని చెబుతుంటారు. అటువంటి వారికి బి కాంప్లెక్స్ గుళికలు లేదా ఇంజెక్షన్లు ఇస్తుంటారు. వాటిపై ఆధారపడటం కంటే తాటిబెల్లం వంటి మంచి ఆహారాన్ని ఎంచుకోవడం ఉత్తమం. శరీరానికి చాలా తక్కువ మోతాదులో సరిపోయే బి కాంప్లెక్స్ విటమిన్లు, తాటిబెల్లంలో అవసరమైన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయి.

Bellam Podi 4

శరీరానికి రోజుకు సుమారు 28 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం బాగుండాలంటే, రక్తపుష్టి మంచిగా ఉండాలంటే ఐరన్ తప్పనిసరి. ఆకుకూరలు, పండ్లు, ఖర్జూరాల్లో ఐరన్ ఉన్నప్పటికీ, తాటిబెల్లంతో పోలిస్తే 20-40 రెట్లు తక్కువగా ఉంటుంది. తాటిబెల్లంలో మనకు కావలసిన దానికంటే 10 రెట్లు పైన ఎక్కువ ఐరన్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా తాటిబెల్లం వాడినా ఎక్కువ ఐరన్ లభిస్తుంది. పూర్వం గర్భిణులకు రక్తహీనత రాకుండా నివారించడానికి తాటిబెల్లాన్ని తినమని ఇచ్చేవారు. ఇది బి కాంప్లెక్స్ విటమిన్లతో పాటు పుష్టిగా ఐరన్‌ను అందించే ఆహారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పరీక్షల్లో లక్ష మంది మహిళల్లో 40,000 మందికి రక్తహీనత ఉన్నట్లు తేలింది. అటువంటి వారికి ఐరన్ క్యాప్సూల్స్ బదులు తాటిబెల్లం సహజసిద్ధంగా ఐరన్‌ను అందించగలదు.

Bellam Podi 5

ప్రస్తుతం తాటిబెల్లం మార్కెట్‌లో పొడి లేదా క్రిస్టల్స్ రూపంలో అందుబాటులో ఉంది. అయితే, కల్తీ లేని స్వచ్ఛమైన తాటిబెల్లాన్ని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. దీనిని వెజిటబుల్ జ్యూసుల్లో, ఫ్రూట్ జ్యూసుల్లో, సలాడ్స్, స్ప్రౌట్స్ మీద చల్లుకొని తినవచ్చు. మొలకలు, డ్రై నట్స్ తినేవారు ఖర్జూరాలకు బదులుగా తాటిబెల్లం ముక్కలను కూడా నంచుకోవచ్చు. తాటిబెల్లం లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది, కాబట్టి పంచదార వలె షుగర్ పెరగదు. డయాబెటిస్ రోగులు కూడా మితంగా వాడుకోవచ్చు.