Shreyas Iyer: క్రికెట్లో కొన్ని యాదృచ్ఛికాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తాయి. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెరీర్లో నవంబర్ 1న అలాంటిదే జరిగింది. 2017 నవంబర్ 1న న్యూజిలాండ్‌పై టీ20 అరంగేట్రం చేసిన అయ్యర్.. 2026 నవంబర్ 1న అదే కివీస్ జట్టుపై కెప్టెన్‌గా టీ20 సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-2తో గెలుచుకుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి సిరీస్‌ను ముందే ఖాయం చేసుకున్న టీమిండియా, చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ట్రోఫీని మాత్రం తన ఖాతాలో వేసుకుంది.
ఈ సందర్భంగా బీసీసీఐ ఓ ప్రత్యేక కొల్లాజ్ను విడుదల చేసింది. పైభాగంలో 2017లో అరంగేట్ర సమయంలో క్యాప్ సర్దుకుంటున్న యువ అయ్యర్ ఉండగా, కింద 2026లో ట్రోఫీతో నవ్వుతూ కనిపిస్తున్న కెప్టెన్ అయ్యర్ ఉన్నాడు. “ఈ రోజు నుంచి ఈ రోజు వరకు.. ఎంతో దూరం వచ్చాడు” అంటూ క్యాప్షన్‌తో ఈ పోస్ట్ ఫ్యాన్స్‌లో వైరల్ అవుతోంది.
ఈ సిరీస్‌లో అయ్యర్ బ్యాట్‌తోనూ మెరిశాడు. ఐదో టీ20లో కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, న్యూజిలాండ్‌పై టీ20ల్లో ఓ భారత కెప్టెన్ చేసిన అత్యంత వేగవంతమైన ఫిఫ్టీగా రికార్డు సృష్టించాడు. అదే మ్యాచ్‌లో 112 మీటర్ల భారీ సిక్సర్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు.
From this day in 2⃣0⃣1⃣7⃣ to 2⃣0⃣2⃣6⃣, Shreyas Iyer has come a long way
#TeamIndia | #NZvIND | @ShreyasIyer15 https://t.co/UOITvvkV5k
— BCCI (@BCCI) November 1, 2026
ఇప్పుడు అయ్యర్ ముందున్న తర్వాతి సవాల్ వన్డే సిరీస్. నవంబర్ 4 నుంచి మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు అతడు జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు.
ఎక్కువమంది చదివినది: 16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో టీమిండియా తోపు..!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


