బెండకాయ నీటిని తయారు చేయడం ఎలా?: ఈ ఆరోగ్యకరమైన పానకాన్ని తయారు చేయడం చాలా సులభం. నాలుగు తాజా బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, 200 మి.లీ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ బెండకాయ ముక్కలను తొలగించి, కేవలం ఆ నీటిని మాత్రమే తాగాలి.

Okra Water For Diabetes

మధుమేహం అజమాయిషీ: బెండకాయ నీటిలో ఉండే కరిగే పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ బాధితులు దీనిని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే, ఈ నీరు తాగిన వెంటనే మధుమేహం మందులు వాడకూడదని, రెండు గంటల వ్యవధి ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Okra Water

అద్భుతమైన జీర్ణశక్తి, గట్ హెల్త్: ఈ నీటిలో ఉండే సహజ ప్రీబయోటిక్ గుణాలు పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అసిడిటీ, కడుపు మంట, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ ఉదయం ఈ నీటిని తాగడం ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చు.

Okra Water For Blood Sugar

చెడు కొలెస్ట్రాల్ నివారణ: శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను నియంత్రించడంలో బెండకాయ నీరు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Water For Digestion

ఎవరు దూరంగా ఉండాలి?: అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు మాత్రం బెండకాయ నీటికి దూరంగా ఉండాలి. ఇందులో ఆక్సలేట్లు ఎక్కువగా ఉండటం వల్ల సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది. అలాగే కొత్తగా ప్రారంభించేవారు తక్కువ మోతాదులో తీసుకుంటూ శరీరం తత్వానికి తగినట్లుగా అలవాటు చేసుకోవడం మంచిది.