Andhra Pradesh Weather: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నేడు మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. వీటితో పాటు మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో గంటకు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు కోరారు.