Vishwak Sen : విశ్వక్ సేన్ కొన్ని ఫ్లాప్స్ తర్వాత ఇటీవలే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ 50 కోట్లు వసూలు చేసి దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది సినిమా నుంచి తన స్టోరీ, తను పడ్డ కష్టాలు, తరుణ్ భాస్కర్ ఇచ్చిన సపోర్ట్ చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

Also Read : Sharwanand : నన్ను కూడా సీఎంని చేస్తారా? నల్గొండ గద్దర్ తో శర్వానంద్ కామెంట్స్ వైరల్..

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత 17 ఏళ్లకే నా స్ట్రగుల్ మొదలయింది. కృష్ణానగర్ లో ఉండే ఉప్మా ఆఫీసులకు వెళ్లి ఆడిషన్ ఇచ్చా. 21 ఏళ్లకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. నా దగ్గర పైసలు తక్కువ ఉన్నాయని వదిలేసి వెళ్ళిపోయింది. అదే సమయంలో ఒక సినిమాలో హీరో అని సెలెక్ట్ చేసి ఫస్ట్ హీరో అన్నారు. తర్వాత సెకండ్ హీరో, తర్వాత మూడో హీరో తర్వాత నాలుగో హీరో అన్నారు. అయినా వెళ్ళాను ఛాన్స్ కోసం. తర్వాత 20 రోజలు ఆఫీస్ కి వెళ్ళాక వేరే వాళ్ళను తీసుకున్నారు నన్ను సినిమాలో నుంచి తీసేసారు అని అపుడు చెప్పారు. నేను అప్పులు చేసి మరీ ఆ టీమ్ కి మందు తాగించి, తినిపించా ఛాన్స్ కోసం. నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసినా ఏడవలేదు కానీ అప్పుడు మూడు రోజులు ఏడ్చాను. అప్పుడే మలయాళంలో ఒక సినిమా చూసి అది డైరెక్షన్ చేద్దాం అనుకున్నా. అదే ఫలక్ నామా దాస్.

మాములుగా యాక్టర్ అయ్యాక ఒక 40 ఏళ్ళు వచ్చాక నటన మీద వైరాగ్యం వచ్చాక డైరెక్షన్ చేద్దాం అనుకున్నా. కానీ మనల్ని పెట్టి ఎవరూ సినిమా తీయట్లే. దాంతో 21 ఏళ్లకే సినిమా డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. నేనే కెమెరా పెట్టి నేనే ఆడిషన్ తీసుకొని ఇంకో 25 రోజుల్లో షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు తరుణ్ భాస్కర్ ఆడిషన్స్ చేస్తున్నాడని తెలిసి మూడు నెలల తర్వాత వెళ్తే నువ్వు ఫలక్ నమ దాస్ సినిమా చేస్తున్నావ్ అంట కదా డేట్స్ ఇష్యూ వస్తాయా అంటే లేదు నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్ సినిమా ఆపేస్తాను అని చెప్పా. స్క్రిప్ట్ ఇస్తే ఫోన్ చేసి నా కథే ఇది అన్నాను. ప్రిపేర్ అయి ఆడిషన్ కి వెళ్ళా. ఈ నగరానికి ఏమైంది లాకప్ లో మోనోలాగ్ సీన్ చేశాను. అందరూ క్లాప్ కొట్టారు. కానీ అంత ఈజీగా సెలెక్ట్ అయ్యాను ఏంటి అనుకున్నా. అంత ఈజీగా ఛాన్స్ రాదు కదా మనకు అనుకున్నా.

తర్వాత ఒక అమ్మాయి తరుణ్ కి మెయిల్ చేసింది. నేను విశ్వక్ తో పనిచేసాను నాకు వచ్చిన పరిస్థితి ఏ అమ్మాయికి రావొద్దు. మీరు అతన్ని పెట్టుకుంటే నేను మీడియాకు వెళ్తా అని చాలా ఎక్కువగా రాసింది. అసలు అదే ఇమెయిల్ చదివితే నేను పెట్టుకునేవాడ్ని కాదు. తరుణ్ కూడా ఫోన్ చేసి నువ్వు లేవు సినిమాలో అన్నాడు. కారణం తెలుసుకుంటే ఇది అని తెలిసింది. దాంతో నన్ను కార్నర్ చేస్తున్నారని తెలిసి ఆ ఇమెయిల్ పంపించు నేను ఎవరో కనుక్కుంటా అని చెప్పాను. అప్పుడు తరుణ్ నన్ను నమ్మి ఇమెయిల్ పంపిస్తే 24 గంటల్లో పట్టుకున్నాను. నేను ఎప్పుడో కాలేజీలో ఒకడ్ని కొడితే వాడు అదే ఆడిషన్ లో సెలెక్ట్ అవ్వక నేను అయితే నేను చేయకూడదు అని వాడు పంపాడు మెయిల్. ఆ రోజు తరుణ్ నన్ను నమ్మకపోతే ఇవాళ నేను లేను.

మా సినిమా వాళ్ళు తప్పు చేస్తే ఊరంతా తిడతారు. నా మీద ట్రోల్స్ చేస్తారు బాధ అవుతుంది. మా పేరెంట్స్ కి తెలిస్తే బాధపడతారు అని. లారీ మీద నుంచి పడ్డా, ఎండలో లో బిపి వచ్చి పడ్డా, నీళ్లలో పడి కుట్లు పడ్డాయి, కాళ్ళు విరగ్గొట్టుకున్నా. చాలా కష్టాలు పడ్డాను సినిమాల్లో. కానీ కష్టపడకుండా చేసిన సినిమాలు ఈ నగరానికి ఏమైంది 1,2. నాకు ఎక్కువ పేరు తెచ్చింది కూడా ఇవే. ఇండస్ట్రీలో ఫ్లాప్స్ వస్తే మర్యాద తగ్గుద్ది. గత కొన్నేళ్లుగా అదే చూసాను. నేను పాతాళంలోకి వెళ్ళినప్పుడు తరుణ్ వచ్చి బయటకు తీసాడు. మా అమ్మ, అక్క, నాన్న దగ్గర 50 శాతం మంచి సంస్కారం నేర్చుకుంటే ఇంకో 50 శాతం తరుణ్ దగ్గరే నేర్చుకున్నా. నువ్వు లేకపోతే నేను లేను. నా లైఫ్ కి నువ్వే హీరో. నువ్వు నా బ్లడ్ బ్రదర్. ఈ సినిమా అయిపోయినందుకు చాలా బాధగా ఉంది. నా లైఫ్ లో ఫస్ట్ 1 మిలియన్, ఫస్ట్ 50 కోట్ల సినిమా ఇదే అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో విశ్వక్ లో ఇంతబాధ ఉందా, ఇన్ని కష్టాలు పడ్డాడా అంటూ ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.