Nanna Kutty : విజయ్ ఆంటోని, ప్రీతీ అస్రానీ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా ‘నాన్న కుట్టి’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాణంలో ము.మారన్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. నాన్న కుట్టి సినిమా నవంబర్ 27న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.

ఈ ట్రైలర్ చూస్తుంటే.. హీరో సింగిల్ గా తన కూతుర్ని పెంచుతూ ఉంటాడు. అనుకోకుండా ఓ సమస్య వచ్చి అది కోర్టు వరకు వెళ్లడంతో ఆ పాప తల్లి ఎవరు, ఏమైంది? హీరో ఇంకో పెళ్లి చేసుకుంటాడా? ఆ పాపకి ఉన్న సమస్య ఏంటి.. అంటూ ఎమోషనల్ సస్పెన్స్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా నాన్న కుట్టి ట్రైలర్ చూసేయండి..

Also See : Chandrabose Daughter : మొదటి సారి సినిమా ఈవెంట్లో చంద్రబోస్ కూతురు అమృత వర్షిణి.. తరుణ్ తో సెల్ఫీ.. ఫోటోలు వైరల్..

ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ఫస్ట్ హాఫ్ బేస్‌లా ఉంటుంది. సెకండాఫ్ ఎమోషనల్‌గా ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ లిథాన్య పాత్రతో అందరూ కనెక్ట్ అవుతారు. నాన్న కుట్టి అందరికీ నచ్చేలా ఉంటుంది. నవంబర్ 27న మా సినిమా రిలీజ్ కానుంది. మా మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు గారికి ధన్యవాదాలు అని అన్నారు. నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. నాన్న కుట్టి సినిమాను మగవాళ్లందరికీ అంకితం చేస్తున్నాను. పదేళ్ల వయసుకి నాన్న అంటే ఏంటో అర్థం కాదు. 20, 30 ఇలా వయసు పెరుగుతూ ఉంటే నాన్న గొప్పదనం అందరికీ అర్థం అవుతుంది. చిన్నతనంలోనే మా నాన్న మా అందరినీ వదిలి వెళ్లిపోయాడు. తల్లిదండ్రుల్ని కలిగి ఉన్న వారే ఈ ప్రపంచంలో అధిక ధనవంతులు అని తెలిపారు.

Nanna Kutty

దర్శకుడు ము. మారన్ మాట్లాడుతూ.. ఇందులో అన్ని రకాల అంశాలు ఉంటాయి. తండ్రీకూతుళ్ల రిలేషన్‌ని మరింత అద్భుతంగా చూపించాం అని తెలిపారు. ప్రీతి అస్రాని మాట్లాడుతూ.. నాన్న కుట్టి నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమా. అమ్మ ప్రేమను అందరూ సెలెబ్రేట్ చేస్తారు. కానీ నాన్న ప్రేమను అంతగా సెలెబ్రేట్ చేయరు. ఈ సినిమా నాన్న గొప్పదనం, త్యాగాన్ని చూపించేలా ఉంటుంది అని తెలిపింది.