Comedian : సినీ పరిశ్రమలో స్టార్స్ గా ఫేమ్ తెచ్చుకున్న నటీనటులు అంతా ఒకప్పుడు వేరు వేరు రంగాల్లో పని చేసి కష్టపడి వచ్చినవాళ్ళే. అలా ఇప్పుడు స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్న నటుడు ఒకప్పుడు డెల్ కంపెనీలో పని చేసినట్టు, అది వదిలేసుకొని యాక్టింగ్ అని వచ్చి కష్టాలు పడ్డట్టు తెలిపాడు. ఇటీవలే ఆ నటుడు పెద్ద హిట్ కొట్టాడు.
ఆ నటుడు ఎవరో కాదు కమెడియన్ అభినవ్ గోమఠం. ఈ నగరానికి ఏమైంది సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది 2 సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. ఈ సినిమా సెకండ్ హాఫ్ అయితే మొత్తం తన భుజాల మీదే నడిపించాడు. ఈ సినిమాకు అభినవ్ గోమఠంకి చాలా అభినందనలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో అభినవ్ ఫన్నీగానే మాట్లాడుతూ తన స్టోరీ చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.
Also Read : Chandrabose : చంద్రబోస్ కూతుర్ని చూశారా.. మొదటిసారి సినిమా ఈవెంట్లో.. తరుణ్ భాస్కర్ కోసం వచ్చి..
అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. లైఫ్ లో మనల్ని తిట్టేటోళ్లు, కిందకు లాగేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ సినిమాకు నాకు వచ్చిన అభినందనలు చూసి అవి మర్చిపోవచ్చు. ఈ సినిమా హిట్ అవ్వడానికి ఒక కారణం నేను కూడా. మీరు ఏం అనుకున్నా ఈ సినిమాలో నేను బాగా నటించాను. నాకు నేనే థ్యాంక్యూ చెప్పుకోవాలి. ఒకప్పుడు నేను డెల్ కంపెనీలో పనిచేసేవాడ్ని. నాకు అప్పుడు నెలకు 30 వేలు శాలరీ. ఆ డెల్ జాబ్ వదిలిపెట్టినపుడు మొదట సంవత్సరానికి 30 వేలు అయింది. కానీ టైం తీసుకొని యాక్టింగ్ కి ట్రై చేశాను. అందుకే నాకు నేను థ్యాంక్యూ చెప్పుకుంటాను. నేను థియేటర్ చేశాను. థియేటర్ ఎందుకు చేయాలి సినిమాలు చేయాలి అని కూడా అనుకున్నా.
ఈ నగరానికి ఏమైంది సినిమాకు ముందు డైరెక్టర్స్ ని కలిస్తే మనం చేద్దాం, నీలో ట్యాలెంట్ ఉంది అనేవాళ్ళు కానీ చేయరు. చేయరు అని తెలిసినా ఛాన్సుల కోసం వెళ్ళేవాడిని. చాలా ఆడిషన్స్ ఇచ్చాను. ఎండా, వాన అయినా వెళ్ళేవాడిని ఆడిషన్స్ కి. మా నాన్న ఎయిర్ ఫోర్స్ లో ఉంటారు. ఆయనకు చాలా ఫోకస్. చదివితే మన పక్కన ఆటంబాంబ్ పడినా డిస్ట్రర్బ్ అవ్వకూడదు అంత ఫోకస్ ఉండాలి అనే వాళ్ళు. కానీ యాక్టింగ్ లోకి వచ్చాక ఆ ఫోకస్ ఉంది నాకు. ఆడిషన్ ఇచ్చి ఈ నగరానికి ఏమైంది కి వచ్చా. ఈ సినిమాలోకి తీసుకున్నందుకు తరుణ్ కి థ్యాంక్స్. ఫస్ట్ సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక మళ్ళీ ఇప్పుడు ఆడిషన్ పెట్టి తీసుకున్నాడు తరుణ్ అని తెలిపాడు.


