బ్యాంకింగ్ రంగంలో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త అందించింది. ముంబయిలోని సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన భారతీయ పౌరులు డిసెంబర్ 10, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మూడు కేటగిరీల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు..
- చీఫ్ మేనేజర్ పోస్టుల సంఖ్య: 2
- మేనేజర్ పోస్టుల సంఖ్య: 14
- డిప్యూటీ మేనేజర్ పోస్టుల సంఖ్య: 4
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (AI & ML) విభాగాల్లో సంబంధిత డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు BE/B.Tech/ME/M.Tech లేదా MSc/MA (Statistics)/MCA డిగ్రీలు కలిగి ఉండాలి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండింటిలోనూ కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. వయోపరిమితి చీఫ్ మేనేజర్ పోస్టులకు 27 నుంచి 37 సంవత్సరాలు, మేనేజర్ పోస్టులకు 26 నుంచి 36 సంవత్సరాలు, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 24 నుంచి 32 సంవత్సరాలు చొప్పున వయసు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
అర్హులైన అభ్యర్థులు SBI అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు నమోదు చేయాలి. అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి, వర్తించే దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ అభ్యర్థులు రూ.750 చొప్పున చెల్లిస్తారు. ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఫీజు లేదు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు చెల్లించిన ఫీజు తిరిగి చెల్లించబడదు. ఎంపికైన అభ్యర్థులకు చీఫ్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.1,02,300 – రూ.1,20,940, మేనేజర్ పోస్టులకు రూ.85,920 – రూ.1,05,280 వరకు, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.64,820 – రూ.93,960 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం
- చీఫ్ మేనేజర్ పోస్టులకు అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ (100 మార్కులు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
- మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్: 50 మార్కులు (క్వాలిఫైయింగ్), ప్రొఫెషనల్ నాలెడ్జ్: 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయిస్తారు. తుది మెరిట్ జాబితాలో రాత పరీక్షకు 70 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ముంబయిలో లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వవచ్చు.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 20 నవంబర్ 2026
- దరఖాస్తుకు చివరి తేదీ: 10 డిసెంబర్ 2026
- ఆన్లైన్ రాత పరీక్ష: డిసెంబర్ 2026 / జనవరి 2027 (తాత్కాలికం)
ఎస్బీఐలో ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

