Ram Nithin’s New Movie with Karthik Jai Palani: ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో రామ్ నితిన్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్న నితిన్.. ఈసారి ఓ ఫ్రెష్ తెలుగు-తమిళ బైలింగ్వల్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కార్తీక్ జై పళని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ఏకకాలంలో తెరకెక్కించనున్నారు. కొత్తదనంతో కూడిన ప్రేమకథగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో రామ్ నితిన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ‘పార్కింగ్’, ‘టీటీటీ’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రార్థన నాథన్తో పాటు ‘ఎన్న సొల్ల పోగిరాయ్’ ఫేమ్ తేజు అశ్విని కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ ముగ్గురి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. జాతీయ అవార్డు అందుకున్న ‘పార్కింగ్’ చిత్రంతో పాటు తెలుగులో ‘వివాహ భోజనంబు’ వంటి సినిమాలను నిర్మించిన కె.ఎస్. సినిష్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని ‘సోల్జర్స్ ఫ్యాక్టరీ’ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు షూటింగ్ వివరాలను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించనుంది. ‘మ్యాడ్’ సిరీస్‌తో యువతకు దగ్గరైన రామ్ నితిన్.. ఈ బైలింగ్వల్ లవ్‌స్టోరీతో ఎలాంటి సందడి చేస్తారో చూడాలి.

