AP Parishad Election: ఆంధ్రప్రదేశ్లో 2026 జిల్లా పరిషత్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఎన్డీఏ కూటమి సర్దుబాట్లలో భాగంగా తమకు దక్కిన జిల్లా పరిషత్ (జెడ్పీ) ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు అభ్యర్థులను జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని 4 జిల్లాలకు జెడ్పీ ఛైర్మన్ అభ్యర్థులను, మరో 5 జిల్లాలకు వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేశారు. సామాజిక న్యాయం, పార్టీ కోసం కష్టపడిన నేతలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ తుది జాబితాను విడుదల చేసినట్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
AP Parishad Election: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికలు.. అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీడీపీ
నాలుగు జిల్లాల జెడ్పీ ఛైర్మన్ పీఠాలపై మహిళా నేతలకు పట్టం.. పూర్తి వివరాలు ఇవే:
కూటమి ఒప్పందంలో భాగంగా జనసేన పార్టీకి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల పరిధిలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్(AP Parishad Election) ఛైర్మన్ స్థానాలు దక్కాయి. ఈ నాలుగు కీలక ఛైర్మన్ పదవులకూ మహిళా నేతలనే ఎంపిక చేస్తూ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
* శ్రీకాకుళం జిల్లా: కొరికాన భవాని (ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ)
* పార్వతీపురం మన్యం జిల్లా: నిమ్మల నీలిమ (భామిని జడ్పీటీసీ)
* అనకాపల్లి జిల్లా: మోటూరు నాగమణి (పరవాడ జడ్పీటీసీ)
* కాకినాడ జిల్లా: బుర్రా దివ్య సునీత రాజ్ (పెద్దాపురం జడ్పీటీసీ)
ఐదు జిల్లాల వైస్ ఛైర్మన్ అభ్యర్థుల తుది జాబితా:
ఛైర్మన్ స్థానాలతో పాటు రాష్ట్రంలోని మరో ఐదు జిల్లాలకు సంబంధించిన జెడ్పీ వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను కూడా జనసేన అధినేత ఖరారు చేశారు. కోస్తాంధ్ర నుంచి రాయలసీమ వరకు వివిధ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎంపిక చేసిన వైస్ ఛైర్మన్ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి:
* తూర్పు గోదావరి జిల్లా: పల్నాటి రజని (నిడదవోలు)
* డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా: ఎలిశెట్టి రామకృష్ణ (కొత్తపేట)
* బాపట్ల జిల్లా: కలవకూరి పిచ్చమ్మ (పర్చూరు)
* ప్రకాశం జిల్లా: వరికూటి లక్ష్మీ తాయారు (దర్శి)
* శ్రీ సత్యసాయి జిల్లా: దాసరి సునేత్ర (గోరంట్ల)

