ABP Southern Rising Summit LIVE Updates: హైదరాబాద్: దక్షిణ భారతదేశ ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక, రాజకీయ ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఏబీపీ నెట్వర్క్ (ABP Network) నిర్వహిస్తున్న 'సదరన్ రైజింగ్ సమ్మిట్–2026' నాలుగో ఎడిషన్‌కు హైదరాబాద్ సిద్ధమైంది. నవంబర్ 20, 2026న 'షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్' అనే థీమ్‌తో ఈ సదస్సు జరుగుతోంది. ఐటీలో బెంగళూరు, లైఫ్ సైన్సెస్‌లో హైదరాబాద్, 'డ్రోన్ సిటీ'గా కర్నూలు సహా ఆరు దక్షిణాది రాష్ట్రాలు దేశాభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్రపై ఇందులో లోతైన చర్చలు జరగనున్నాయి.
ఉదయం 10:40 గంటలకు ఏబీపీ నెట్వర్క్ సీఈవో సుమంత దత్తా స్వాగతోపన్యాసంతో సదస్సు ప్రారంభమవుతుంది. ఉదయం 11:00 గంటలకు తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఎంపీ రేణుకా చౌదరి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్, ఏపీ మంత్రి టి.జి. భరత్, తమిళనాడు మంత్రి వన్ని అరసు తదితరులు కీలక అంశాలపై ప్రసంగిస్తారు.
రాజకీయ ప్రముఖులతో పాటు శోభనా కామినేని, మనోజ్ కుమార్, ప్రణవ్ వేంపటి, ధీమంత్ నాగరాజ్, అనిల్ శ్రీనివాసన్ వంటి వివిధ రంగాల నిపుణులు చర్చల్లో పాల్గొంటారు. సాయంత్రం 6:30 గంటల తర్వాత సినీ తారలు శ్రద్ధా కపూర్, మృణాల్ ఠాకూర్ తమ సినీ అనుభవాలను పంచుకోనున్నారు. గత మూడు ఎడిషన్ల విజయవంతమైన ప్రస్థానం తర్వాత ఈ నాలుగో సదస్సు నిర్వహిస్తున్నారు.
గత ఎడిషన్ల ప్రస్థానం
1వ ఎడిషన్ (2023 - చెన్నై): తమిళిసై సౌందరరాజన్, ఉదయనిధి స్టాలిన్, రానా దగ్గుబాటి, రిక్కీ కేజ్ తదితరులు పాల్గొన్నారు.
2వ ఎడిషన్ (2024 - హైదరాబాద్): సీఎం రేవంత్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, పుల్లెల గోపీచంద్, సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా తదితరులు హాజరయ్యారు.
3వ ఎడిషన్ (2025): 'రెడీ ఫర్ ది ఫ్యూచర్' థీమ్‌తో జరిగిన ఈ సదస్సులో ఉదయనిధి స్టాలిన్, కేటీఆర్, కె. కవిత, కె. అన్నామలై, మాళవిక మోహనన్ పాల్గొన్నారు.

