ధనియాల రైస్ వినడానికి కొత్తగా ఉన్నా మీరు బాగా వేయించి దీనిలో నాలుగు ధనియాలు, మసాలా దినుసులు, నెయ్యి , ఇంకా అన్నంతో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్ధాలు , తయారీ విధానం కూడా ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు : 2 కప్పులు ఉడికించిన అన్నం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు , 3 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు , రెండు టేబుల్ స్పూన్స్ వేరుశనగ పలుకులు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, 2 కరివేపాకులు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు నూనె , చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

ధనియాల రైస్ ఎలా చేయాలంటే : ముందుగా పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, నాలుగు ఎండుమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సువాసన వచ్చేవరకు వేయించాలి. ఇది చల్లారాక మిక్సీలో కొంచం బరకగా పొడి చేసుకోవాలి.

ధనియాల రైస్ స్టెప్ 1 : పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి అది బాగా వేడి అయినా తరవాత దీనిల్ శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, వేరుశనగ కూడా దీనిలో వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, చిటికెడు పసుపు కూడా దీనిలో వేసుకోవాలి. ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది.

ధనియాల రైస్ స్టెప్ 2 : ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పొడిని దీనిలో వేసి ఇంకా దీనిలో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒక నిమిషం పాటు దీనిని మంచిగా కలపాలి. ఆ తర్వాత దీనిలో ఉడికించిన అన్నం ఇంకా వేసి మసాలాలు కూడా దీనిలో వేసి బాగా పట్టేలా మంచిగా కలపాలి. అంతే, వేడి వేడి ధనియాల రైస్ రెడీ.

