హైదరాబాద్, నవంబర్ 20: యూజీసీ నెట్ (UGC NET) డిసెంబర్ సెషన్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు, అలాగే డిసెంబర్ 21వ తేదీన కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా.. దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించేందుకు యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏటా రెండుసార్లు జరిగే ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు.
- మొదటి షిఫ్ట్: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
- రెండో షిఫ్ట్: మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలను కూడా ఎన్టీఏ వెల్లడించింది. అభ్యర్థులు నవంబర్ 23 నుంచి పరీక్ష నగర వివరాలతో కూడిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 7 నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. యూజీసీ నెట్ డిసెంబర్ సెషన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు, షిఫ్ట్‌ల వివరాలను పరిశీలించుకోవాలి. పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం, ఇతర ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. అభ్యర్థులు పరీక్షకు ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకొని, అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
యూజీసీ నెట్ 2026 అడ్మిట్ కార్డు డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

