Varanasi : మార్కెటింగ్ అంటే రాజమౌళి తర్వాతే . అందరూ సినిమా రిలీజయ్యాక డబ్బులెలా వస్తాయని ఆలోచిస్తుంటే రాజమౌళి మాత్రం తన సినిమా రిలీజ్ కిముందే ఎలా సేఫ్ అవుతుందా అని లెక్కలేస్తారు. కొన్నేళ్లుగా పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ఆ రూట్లో సక్సెస్ అవుతున్న రాజమౌళి వారణాసి విషయంలో అదే చేస్తున్నారట.
షూటింగ్ అయ్యాక రష్ చూసి సినిమా మీద బిజినెస్ చెయ్యడం కాదు. అనౌన్స్మెంట్ తోనే రికార్డ్ రేంజ్ బిజినెస్ కి తెరతీస్తుంది రాజమౌళి సినిమా. అందుకే అందరి చూపు వారణాసి మీదే. ఈసారి వారణాసి మీద రాజమౌళి ఎంత బిజినెస్ చేస్తారు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. దీనికి తగినట్టు అటు థియేట్రికల్, ఇటు డిజిటల్ రైట్స్ కోసం వందలకోట్లు పెడతామంటూ పోటీ ఉండడంతో వారణాసి ప్రీ రిలీజ్ బిజినెస్ మీద బాగా చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా థియేట్రికల్ డీల్ క్లోజ్ అవ్వడంతో నెక్ట్స్ డీల్స్ మీద ఇంట్రస్ట్ క్రియేటవుతోంది.
Also See : Jabardasth Rakesh Sujatha : జబర్దస్త్ రాకేష్ – సుజాత లక్ష్మి పూజ.. ఫ్యామిలీతో ఫొటోలు..
సినిమా రిలీజ్ అయ్యాకే కాదు రిలీజ్ అవ్వకముందు నుంచే ప్రతి డీల్ విషయంలో రికార్డులు సెట్ చేస్తారు రాజమౌళి. అలా ఇప్పటి వరకూ ఇండియన్ సినిమా హిస్టరీలోనే లేనటువంటి హయ్యస్ట్ రేట్ కి వారణాసి డీల్ సెట్ అవుతోందని టాక్. నెక్ట్స్ సమ్మర్ రిలీజ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న రాజమౌళి- మహేశ్ బాబు వారణాసి సినిమా థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే 300కోట్లకి ఓవర్సీస్ కాకుండా మిగిలిన ప్రాంతాలు అమ్ముడయ్యాని సమాచారం.
దీంతో స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ తో పాటు మిగతా ఓటీటీలు పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి RRR సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్లస్ అయింది. ఇప్పుడు రాజమౌళి సినిమాలకు విదేశాల్లో కూడా క్రేజ్ ఉంది. అందుకే రాజమౌళి-మహేశ్ సినిమాని మిస్ చేస్కోవద్దని ప్లాన్ చేస్తున్న ఓటీటీలు డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 500కోట్ల వరకూ కోట్ చేశారని టాక్ వినిపిస్తుంది.
బాహుబలి నుంచి రాజమౌళి సినిమాలన్నీ వేలకోట్ల కలెక్షన్లతోనే కంటిన్యూ అవుతున్నాయి. అందుకే ఎంతైనా ఇన్వెస్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. దీనికి తోడు ఈ సారి వారణాసిలో మహేశ్ బాబు, హాలీవుడ్ ప్రియాంక చోప్రా యాడెడ్ ఎట్రాక్షన్. ఈ స్టార్ స్టడెడ్ మూవీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ తో పాటు మైథాలజీ, ఎమోషన్స్ తో కలిపి ఫుల్ మీల్స్ ఇవ్వబోతోందని ఇప్పటికే హింట్ ఇచ్చేశారు రాజమౌళి. వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ బిగ్ కాన్వాస్ మీద తెరకెక్కుతున్న వారణాసి ఈ ప్రీ రిలీజ్ డీల్స్ తోనే 1000కోట్ల బడ్జెట్ ని రికవర్ చేసేలా కనిపిస్తోంది. దాంతో ఈసారివారణాసి సినిమా ఇండస్ట్రీలో కొత్త కలెక్షన్ల రికార్డులు సెట్ చెయ్యడం గ్యారంటీ అంటున్నారు ఫాన్స్.

