Vijay Sethupathi : పాన్ ఇండియా వైడ్ గా సూపర్ క్రేజ్ ఉన్న హీరో సినిమా రిలీజ్ చెయ్యాలంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకు కనీసం 3 నెలలైనా గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇండియా మొత్తం సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ఉన్న ఈ హీరో 15రోజుల్లో 2 సినిమాలు రిలీజ్ చేయబోతున్నాడు.
తమిళ్ , సౌత్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా మంచి ఇమేజ్ ఉన్న విజయ్ సేతుపతి మూవీ అంటే అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తారు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేని క్రేజ్ సంపాదించుకున్న ఈ స్టార్ హీరో ఈ సారి డబుల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. పెద్ద గ్యాప్ లేకుండానే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా సూపర్ హిట్ అయిన బత్తా సినిమా తర్వాత విజయ్ సేతుపతి నెక్ట్స్ సినిమాల రిలీజ్ ఫాన్స్ కి మాత్రం సర్ ప్రైజ్ చేస్తోంది.
Also See : Jabardasth Rakesh Sujatha : జబర్దస్త్ రాకేష్ – సుజాత లక్ష్మి పూజ.. ఫ్యామిలీతో ఫొటోలు..
విజయ్ సేతుపతి 15 రోజుల్లో 2 సినిమాల రిలీజ్ అనౌన్స్ చేశారు. లేటెస్ట్ గా మణిరత్నం, సాయిపల్లవి కాంబినేషన్లో మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న ఇంజివెల్లం మూవీ జనవరి 29న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. సంక్రాంతి రిలీజ్ అని గతంలో చెప్పిన టీమ్ లేటెస్ట్ గా జనవరి ఎండింగ్ కి రిలీజ్ షిఫ్ట్ చేసుకుంది.
మణిరత్నం-విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వస్తున్న ఇంజివెల్లం పై అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. ఈ సినిమా జనవరి 29న రిలీజవుతుంటే అంతకంటే ముందే జనవరి 14న పొంగల్ బరిలో దిగుతోంది పాకెట్ నోవెల్. విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్ లీడ్ రోల్స్ లో రాజ్ .బి శెట్టి ఇంపార్టెంట్ రోల్ లో ఇంట్రస్టింగ్ డ్రామాగా తెరకెక్కుతోంది పాకెట్ నోవెల్ సినిమా.
Also See : Artist Priya : సినిమా ఈవెంట్లో సందడి చేసిన సీనియర్ నటి ప్రియ.. చీరలో మెరిపిస్తూ..
ఇలా ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్ 15రోజులే కావడంతో ఫాన్స్ ఒకపక్క ఆనందపడడంతో పాటు వర్రీ కూడా అవుతున్నారు. 2 సినిమాలు డిఫరెంట్ జానర్స్ , డిఫరెంట్ లుక్స్ తో ఉండడం, మంచి సీజన్లోనే రిలీజవుతుండడంతో క్లాష్ ఫేస్ చేస్తాయా లేక రెండూ హిట్ అయి మంచి కలెక్షన్లు రాబడతాయా అని ఆలోచనలో పడ్డారు అందరూ.

