Priya Bhavani Shankar : ఇటీవల పలువురు సినీ సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తేజ సజ్జా, సాయి దుర్గ తేజ్, కావ్య కళ్యాణ్ రామ్.. ఇలా పలువురు సినీ సెలబ్రిటీలు త్వరలో పెళ్లి చేసుకోబోతుండగా తమిళ భామ ప్రియా భవానీ శంకర్‌ కూడా పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తుంది.

న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టి సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకొని తమిళ్ లో హీరోయిన్ అయింది ప్రియా భవానీ శంకర్‌. తెలుగులో కళ్యాణం కమనీయం, జీబ్రా, భీమా, ఇరుముడి సినిమాలతో మెప్పించింది. తమిళ డబ్బింగ్ సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవలే ఇరుముడి సినిమాతో భారీ విజయం సాధిచింది.

Also Read : Venkatesh : ఆలయాలకు వెళ్లడం ఆపేసిన వెంకీమామ.. ఎందుకో తెలుసా?

ప్రియా భవానీ శంకర్ త్వరలో వ్యాపారవేత్త రాజ్‌వెల్ రాజన్ ని పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా వీరి నిశ్చితార్థం జరిగినట్టు సమాచారం. ప్రియా భవానీ శంకర్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో తనకు కాబోయే భర్తతో కలిసి దిగిన ట్రెడిషినల్ ఫోటోలను, చేతికి మెహందీ పెట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ జంట దాదాపు పదేళ్లకు పైగా రిలేషన్‌లో ఉన్నారని తమిళ మీడియా సమాచారం. గతంలో రాజ్ వెల్ తో కలిసి పలు ఫోటోలను షేర్ చేసి అధికారికంగానే వీరి ప్రేమని ప్రకటించింది. ఇన్నేళ్ల తర్వాత ఒక్కటవుతున్న ఈ జంట. 2022లో ఈ ఇద్దరూ కలిసి ఒక ఇల్లు కూడా కొనుక్కున్నారట. తాజాగా ఈ జంట నిశ్చితార్థం చేసుకోగా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.

Priya Bhavani Shankar Ready to Marriage with her Love