Xiaomi 18 Pro Series Global Launch Date Confirmed: షావోమీ (Xiaomi) తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పలు టీజర్లతో ఆసక్తి పెంచిన కంపెనీ.. తాజాగా Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 17న ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సిరీస్‌లోని ఫోన్లు వైట్, బ్లాక్, కాస్మిక్ బ్లూ, ప్రత్యేకమైన వెల్వెట్ రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నాయి. కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో ఫోన్ వెనుక భాగంలో ఉండే సెకండరీ డిస్‌ప్లేను చూపించింది. అలాగే ఇందులో డ్యూయల్ 200MP కెమెరా సిస్టమ్‌ను అందించనున్నట్లు వెల్లడించింది.

కొన్ని రోజుల క్రితం ఇటలీకి చెందిన ఓ రిటైల్ వెబ్‌సైట్‌లో Xiaomi 18 Pro సిరీస్ ఫోన్ల వివరాలు లీక్ అయ్యాయి. వాటి ప్రకారం.. చైనాలో 7,000mAh బ్యాటరీతో వచ్చిన Xiaomi 18 Pro గ్లోబల్ వేరియంట్‌లో 6,000mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. ఇక Xiaomi 18 Pro Max చైనా వేరియంట్‌లో 8,500mAh బ్యాటరీ ఉండగా.. గ్లోబల్ మోడల్‌లో 7,050mAh బ్యాటరీని అందించనున్నట్లు సమాచారం. ఇందులో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కొనసాగనుంది.

ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్లలో 1Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్ కలిగిన LTPO OLED మెయిన్ డిస్‌ప్లే ఉండనుంది. వెనుకవైపు 120Hz AMOLED సెకండరీ డిస్‌ప్లేను కూడా అందించనున్నారు. Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 ప్రాసెసర్‌తో ఈ ఫోన్లు పనిచేయనున్నట్లు లీకైన సమాచారం వెల్లడిస్తోంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా (102 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ), 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 5X ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కూడా ఉండనుంది. అంతేకాకుండా దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP69 రేటింగ్‌ను అందించనున్నట్లు సమాచారం.

Image (1)

ధరల విషయానికి వస్తే.. 12GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్లలో Xiaomi 18 ప్రో అందుబాటులోకి రానున్నట్లు ఇటలీ వెబ్‌సైట్ లిస్టింగ్ వెల్లడించింది. Xiaomi 18 Pro Max మాత్రం 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రానున్నట్లు తెలుస్తోంది. అయితే గ్లోబల్ మార్కెట్ ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Image