Bigg Boss Nominations : నేడు సోమవారం నామినేషన్ డే. బిగ్ బాస్ అందరికి ఒకర్ని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. ఎవర్ని నామినేట్ చేస్తారో చెప్పి, కారణాలు చెప్పి ఒక బాల్ కి వాళ్ళ ఫోటోని అతికించి ఆ బాల్ ని డోర్ బయటకు వెళ్లేలా తన్నాలి.

మొదట అమన్.. శివని నామినేట్ చేసాడు. గోట్ వద్దన్న విషయంలో, ఇంకొన్ని పాయింట్స్ చెప్పి నామినేట్ చేసాడు. అమన్ – శివ మాట్లాడుతుంటే మధ్యలో త్రిగున్ ఎంట్రీ ఇచ్చి వాదించాడు.

ముకేశ్.. సుధీర్ ని నామినేట్ చేసాడు. సుధీర్ ముకేశ్, వర్షిణి టీమ్ ని వదిలేసి వెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో ఏదో ఒకరోజు కాటేస్తాడు అనుకున్నాను కాటేసాడు. అతన్ని నమ్మాను. మేము లేకపోతే నువ్వు కెప్టెన్ కాదు కదా కంటెండర్ కూడా అయ్యేవాడివి కాదు అని దారుణంగా మాట్లాడాడు. నువ్వు నమ్మక ద్రోహి అన్నాడు. అనవసరంగా నిన్ను సేవ్ చేశాను నామినేషన్ నుంచి అన్నాడు. మధ్యలో దేబ్జానీ పేరు తీసుకొచ్చాడు. దీంతో సుధీర్ కూడా ఫైర్ అయ్యాడు.

Also Read : Donga Naa Koduku Trailer : ‘దొంగ నా కొడుకు’ ట్రైలర్ వచ్చేసింది.. లిటిల్ హార్ట్స్ మౌళి కొత్త సినిమా..

శ్వేతా.. నీతూ మాస్టర్ ని నామినేట్ చేసింది. మీకు సపోర్ట్ చేయకపోతే పెద్ద బొక్క పెడతారు మీరు. త్రిగున్ కి భజన చేస్తున్నావ్ అన్నారు. సేఫ్ ప్లేయర్, కూరగాయల పాడయిపోయిన ఇష్యూ, ఆట లేదు, సహనం లేదు అని చెప్పి నామినేట్ చేసింది. నీతూ మాట్లాడుతూ త్రిగున్ పేరుతేవడంతో త్రిగున్ – నీతూ గొడవ పడ్డారు. తర్వాత శ్వేతా – నీతూ వాదులాడుకున్నారు. నీతూ ఊరికే ట్రిగ్గర్ అయిపోయి అరుస్తుంది.

శివ..ముకేశ్ ని నామినేట్ చేసాడు. ప్రాంక్ విషయం మాట్లాడాడు. దేబ్జానీ వెనక పడుతున్నాను అని క్యారెక్టర్ నెగిటివ్ చేసిన ఇష్యూ గురించి మాట్లాడాడు. ఎక్కువ నోరు జారతారు. మబ్బుల్లో ఉన్నారు మీరు మబ్బేష్ అని అన్నాడు శివ. మధ్యలో సుధీర్ ముకేశ్ తో గొడవ పడ్డాడు. వర్షిణి వల్ల ముకేశ్ గేమ్ పోతుందని ఝాన్సీ కూడా చెప్పింది అని సుధీర్ అన్నాడు. మీతో ఉంటె ఒకలా లేకపోతే ఇంకోలా అని వర్షిణి, ముకేశ్ పై సుధీర్ ఫైర్ అయ్యాడు శివ నామినేషన్ లో.

రామకృష్ణ .. సుధీర్ ని నామినేట్ చేసాడు. ఆటలో గివ్ అప్ ఇచ్చినందుకు. అలాగే ముకేశ్ సపోర్ట్ చేసినా అతనికి కృతజ్ఞత లేనందుకు. ముకేశ్ వల్లే ఉన్నావు నువ్వు అని రామకృష్ణ అన్నందుకు సుధీర్ ముకేశ్ తో గొడవ పడ్డాడు. సుధీర్ – ముకేశ్ గొడవ పడ్డారు రామకృష్ణ నామినేషన్ లో. మధ్యలో త్రిగున్ వచ్చాడు.

నరేష్ .. నీతూ మాస్టర్ ని నామినేట్ చేసాడు. మీ వల్ల నా గేమ్ డిస్టర్బ్ అయింది. సన్ డే ఫన్ డే కానీ నిన్న మాట్లాడిన మాటలు ఇక్కడిదాకా తీసుకొస్తున్నారు. వంశీని కొట్టినందుకు గేమ్ లో అని నామినేట్ చేసాడు. నీతూ నరేష్ ని కూడా సేఫ్ ప్లేయర్ అంది. అంతకుముందు శ్వేతా ని కూడా అదే అనడంతో శ్వేతా ఆమెని ఎవరు ఏమన్నా సేఫ్ ప్లేయర్ అంటుంది అని ఫైర్ అయ్యారు. మధ్యలో త్రిగున్ మీద ఫైర్ అయింది నీతూ. అసలు ఎదురుతి వాళ్ళు మాట్లాడుతుంటే వినకుండా మాట్లాడుతుంది నీతూ.

Also See : Naveen Chandra : నవీన్ చంద్ర ఫ్యామిలీని చూశారా..? దీపావళి స్పెషల్ ఫొటోలు..

దేబ్జానీ కూడా నీతూని నామినేట్ చేసింది. ఫ్యామిలీ రిజెక్టుకి తన పేరు రాసినందుకు. సేఫ్ ప్లేయర్ అందర్నీ అంటున్నారు కానీ మీరే అంది. దేబ్జానీ తో కూడా నీతూ గొడవ పెట్టుకుంది.

సుధీర్.. ముకేశ్ ని నామినేట్ చేసాడు. నేను నమ్మిన వ్యక్తి. కానీ వాళ్ళు నచ్చనప్పుడు మారిపోతారు. నచ్చితే ఒకలా ఉంటారు. లేకపోతే లేదు. కెప్టెన్ గేమ్ లో ఇష్యూ గురించి, ముకేశ్ గుండు సున్నా అని మాట్లాడాడు. ఫ్యామిలీ టాస్క్ గురించి సుధీర్.. త్రిగున్, అమన్ పేరు పెట్టి మాట్లాడటంతో త్రిగున్ – ముకేశ్ గొడవ పడ్డారు. సుధీర్ – ముకేశ్ గట్టిగానే అరుచుకొని గొడవ పడ్డారు.

నీతూ.. త్రిగున్ ని నామినేట్ చేసింది. ఇష్టమొచ్చినట్టు మాటలు మాట్లాడతారు అని. మధ్యలో వంశీ మాట్లాడాడు. వంశీ – నీతూ మాస్టర్ గొడవ పడ్డారు. వంశీ మీద ఫైర్ అయింది నీతూ మాస్టర్ అవతలి వాళ్ళు చెప్పేది వినకుండా.

రామ్ ప్రసాద్.. వర్షిణి ని నామినేట్ చేసాడు చెప్పినట్టే గత వారం తనపై రాసిన లెటర్ పట్టుకొనే నామినేట్ చేసాడు. ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి వాదులాట పెట్టుకున్నారు. నరేష్ గురించి రాసినందుకు కూడా కోప్పడ్డాడు.

త్రిగున్.. నీతూ మాస్టర్ ని నామినేట్ చేసాడు. తనని జోకర్ అనేందుకు, తాను చేసిన తప్పులు అన్ని చెప్తూ, తన పాయింట్స్ చెప్తున్నా వినకుండా నీతూ మాస్టర్ అరుస్తూనే ఉంది. మధ్యలో వంశీ తో గొడవ పెట్టుకుంది. తనే అరిచి తనే ఏడ్చింది. ఎమోషనల్ అయినట్టు యాక్ట్ చేసింది. ప్రతి మాటకు ఎమోషనల్ అయిపోతుంది. తన గురించి ఏం చెప్పినా తీసుకోలేకపోతుంది. ఆట ఆడకపోయినా పర్లేదు అని అని తనకు తానే సపోర్ట్ చేసుకుంటుంది.

Also Read : Polimera 3 : పొలిమేర 3 గ్లింప్స్ వచ్చేసింది.. నగ్నంగా సత్యం రాజేష్..

వర్షిణి.. సుధీర్ ని నామినేట్ చేసింది. వాళ్ళ టీమ్ నుంచి వెళ్ళిపోయినందుకు, మిత్ర ద్రోహం చేసాడు అంది. మధ్యలో సుధీర్ – ముకేశ్ గొడవ పెట్టుకున్నారు. వర్షిణి సుధీర్ పై ఫైర్ అయింది.

చివరకు వంశీ కూడా నీతూ మాస్టర్ ని నామినేట్ చేసాడు. నీతూ మాస్టర్ చేసిన తప్పులన్నీ చెప్పి నామినేట్ చేసాడు. వంశీ మాట్లాడుతున్నా వినకుండా మళ్ళీ ఎమోషనల్ అయిపోయి అరిచింది. నామినేషన్ చేస్తుంటే తీసుకోలేకపోయింది. మొత్తానికి ఇవాళ నీతూ మాస్టర్ మంచి సింపతీ గేమ్ ఆడినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. బిగ్ బాస్ లో అందరూ గొడవ పడతారు. ఎవరు ఏమన్నా తీసుకుంటారు కానీ నీతూ మాస్టర్ తనకు ఏం చెప్పినా, నెగిటివ్ పాయింట్స్ చెప్పినా, నామినేషన్ చేసినా తీసుకోలేకపోతుంది. ఇలా అయితే కష్టమే.

ఇక చివర్లో బిగ్ బాస్ వచ్చి మీ నామినేషన్స్ పక్కన పెట్టి నేను అందర్నీ నామినేట్ చేస్తున్నాను అని అందరికి షాక్ ఇచ్చాడు. ఈ వారం కెప్టెన్ వంశీ మినహా అందరూ నామినేషన్స్ లో ఉంటారు అని చెప్పాడు. దీంతో ఈ వారం వంశీ తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ వారం చివర్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.