Jr NTR : జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ డ్రాగన్‌పై ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ స్పీడ్‌గా కొనసాగుతుండగా..లేటెస్ట్గా తారక్ యాక్షన్ సీక్వెన్స్‌లపై చర్చ జరుగుతోంది. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్బస్టర్లతో తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ నీల్..ఈ పిక్చర్‌ను భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతున్నాడట.
ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం..డ్రాగన్‌ను నెక్స్ట్ లెవల్లో తెరకెక్కిస్తున్నారట. ఎన్టీఆర్‌ని రా ఆఫ్ యాక్షన్, పవర్ఫుల్ రివెంజ్ హీరోగా చూపిస్తూ భారీ యాక్షన్ బ్లాక్స్, ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్‌ల షూటింగ్ కొనసాగుతోందట.
Sobhita Dhulipala : శోభితా ధూళిపాళ్ల దీపావళి స్పెషల్ ఫోటోలు..
ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ ప్రెజెంటేషన్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఆయన బాడీ లాంగ్వేజ్, ఫైటింగ్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని యాక్షన్ సన్నివేశాలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. కేవలం భారీ ఫైట్లు మాత్రమే కాకుండా, ప్రతి యాక్షన్ ఎపిసోడ్లో ఒక ప్రత్యేకమైన ఇంపాక్ట్ ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లలో కొత్త తరహా కొరియోగ్రఫీ, భారీ విజువల్స్, ఇంటెన్స్ ఎమోషన్స్ కలగలిపి చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్‌ను చూడని సరికొత్త యాక్షన్ అవతార్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందట. సినిమాలోని కీలక యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు థియేటర్లలో నెక్స్ట్ లెవల్ ఎగ్జైట్మెంట్ను కలిగించేలా మూవీ రూపొందిస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు డ్రాగన్ ఒక సరికొత్త యాక్షన్ ట్రీట్‌గా నిలిచే అవకాశం ఉంది.

