Pawan Kalyan Anna Lezhneva Divorce:  సోమవారం పొద్దుపోయాక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కార్యాలయం నుంచి ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. తన భార్య అనా లెజ్‌నెవా కొణిదెలతో వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఓ నోట్ వచ్చింది. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ పవన్ కల్యాణ్- అనా కొణిదెల ఉమ్మడిగా ఆ ప్రకటన ఇచ్చారు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతామని తెలిపారు. మిత్రులు,శ్రేయాభిలాషులను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో ఏముందంటే..."జీవితంలో చాలా విలువైన సమయాన్ని కలిసి జీవించిన మేం.. పరస్పర అవగాహన గౌరవంతో ఇక నుంచి వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నాం.. మా వైవాహిక బంధం ముగిసినా మేం మంచి స్నేహితులుగానే కొనసాగుతాం. అలాగే మా పిల్లలో సంతోషం... బాగోగులను చూసుకునేందుకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతాం. మా వ్యక్తిగత జీవితంలో వస్తన్న ఈ మార్పును మీరంతా అర్థంచేసుకుని.. మా గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నాం. ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు"


పవన్ వైవాహిక జీవితం- ఒడిదుడుకులమయం

రష్యన్ మోడల్, నటి అయినఅనా లెజ్‌నోవాను పవన్ కల్యాణ్  సెప్టెంబర్30, 2013న వివాహం చేసుకున్నారు. వీరికి పొలెనా అంజనా పవనోవా Polona Anjana Pawanova, మార్క్ శంకర్ పవనోవిచ్ Mark Shankar Pawanovich అనే ఇద్దరు పిల్లలున్నారు. అయితే పవన్ కల్యాణ్‌కు అంతకు ముందే వివాహాలయ్యాయి. ఆయనకు 1997లో  విశాఖపట్నంకు చెందిన నందినితో వివాహం జరగగా.. 2008లో విడాకులయ్యాయి. 2009లో తన సహనటి రేణిదేశాయ్‌ను పవన్ కల్యాణ్‌ వివాహం చేసుకున్నారు. వీరికి అకీరానందన్, ఆధ్య అనే పిల్లలున్నారు. పవన్ -రేణుదేశాయ్ 2012లో విడిపోయారు. తీన్‌మార్ సినిమాలో నటించిన అనాలెజ్‌నవాను పవన్ కల్యాణ్ 2013లో వివాహం చేసుకున్నారు. 


షాకింగ్ డెసిషన్ 

పవన్ కల్యాణ్ వైవాహిక జీవితం ఇంతకు ముందు అంత సవ్యంగా లేనప్పటికీ... ఈ నిర్ణయం మాత్రం షాకింగ్‌ ఇచ్చింది. ఎందుకంటే.. పవన్ అనా చాలా అన్యోన్యంగా కనిపించేవారు. మొన్నటి ఆగస్టు 15 స్వాతంత్ర్య వేడుకల్లోనూ అనా కొణిదెల అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ కేరళ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆయన వెన్నంటే ఉన్నారు. విదేశాల్లో జన్మించినప్పుటికీ ... పూర్తిగా తెలుగు సాంప్రదాయాలను గౌరవస్తూ... ఆహార్యాన్ని కూడా మార్చుకున్నారు. పవన్ కల్యాణ్‌ మెగా కుటుంబంలో బాగా కలిసిపోయారు. ఆయన రెండో భార్య పిల్లలతోనూ అత్యంత చనువుగా ఉన్నారు. కొన్ని రోజుల కిందటి వరకూ కూడా చాలా అన్యోన్యంగా కనిపించిన వారు.. ఈ నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. వాళ్లిద్దరి మధ్యా పొరపొచ్చాలు ఉన్న సంకేతాలు కూడా ఎప్పుడూ లేవు. ఆమె అన్ని సందర్భాల్లోనూ పవన్ కు వెన్నంటే నిలిచారు. 


రాజకీయ ప్రభావం
వైవాహిక బంధం అన్నది వ్యక్తిగతమే అయినప్పటికీ.. "పవన్ కల్యాణ్‌ పెళ్లిళ్లు" అన్నది పబ్లిక్ టాపిక్ అయిపోయింది. పవన్ పెద్ద సినిమా సెలబ్రిటీ కావడం, రాజకీయాల్లోకి రావడంతో అనివార్యంగా ఆయన వ్యక్తిగత జీవితం- పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. దానిని పవన్ కల్యాణ్ ధైర్యంగానే ఎదుర్కొన్నారు. ముఖ్యంగా YSRCP పవన్ కల్యాణ్‌ మూడుపెళ్లిళ్లు చేసుకున్నారంటూ ఆయన్ను కించపరిచేలా మాట్లాడింది. అప్పటి సీఎం, YSRCP అధ్యక్షుడు జగన్.. నేరుగానే పవన్ కల్యాణ్‌ వివాహ బంధాల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ పరిస్థితి అన్నది పవన్ కల్యాణ్‌కే కాదు.. జనసేనకు కూడా కాస్త ఇబ్బందే. ఇప్పటి వరకూ వవన్ తన వివాహ జీవితం గురించి నేరుగా కుండబద్దలు కొట్టినట్లే మాట్లాడారు. ఇక ముందు ఏ స్టాండ్ తీసుకుంటారో చూడాలి.