Telangana Congress Vs BRS Personal Attacks:  తెలంగాణ రాజకీయ రంగంలో అధికార కాంగ్రెస్, ప్రధాన విపక్ష బిఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు మరింత పదునెక్కుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య సాగుతున్న ప్రత్యక్ష వైరం ఇప్పుడు పరాకాష్టకు చేరింది. విధానాలు, పరిపాలనా లోపాల ఆధారంగా విమర్శలు చేసుకోవాల్సింది పోయి.. వ్యక్తిగత రూపం, గెటప్‌లు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, గడ్డం పెంచడం వంటి అంశాల దాకా విమర్శలు వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్ గైర్హజరీలో కేటీఆరే లీడర్ 

ఇటీవలి సభల్లో సీఎం రేవంత్ రెడ్డి..  గడ్డం పెంచినంత మాత్రాన ఎవరూ రేవంత్ రెడ్డి కా లేరు  అని సెటైర్లు వేయడం, గతంలో కేటీఆర్ లుక్‌పై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల మధ్య పగను మరింత పెంచాయి. అయితే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేత, ప్రతిపక్షంలో ఉన్న ఒక నాయకుడి వ్యక్తిగత ఇమేజ్‌పై ఇంతలా దృష్టి సారించి దాడి చేయడం వెనుక బలమైన రాజకీయ లెక్కలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  ఈ వ్యూహంలో మొదటి ప్రధాన కోణం — ప్రత్యర్థి గుర్తింపు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో, మీడియా ముందుకు రావడం గణనీయంగా తగ్గించారు. అసెంబ్లీలో లేదా ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ తరఫున కేటీఆర్, హరీష్ రావులే ప్రధానంగా గళం విప్పుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ స్థానంలో బీఆర్ఎస్ ప్రధాన ముఖంగా కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి స్వయంగా గుర్తించినట్లేనని పొలిటికల్ పండితులు అంచనా వేస్తున్నారు. కేటీఆర్‌నే తన ముఖాముఖి   ప్రత్యర్థిగా ఎంచుకోవడం ద్వారా, ఇతర నాయకులను పక్కకు నెట్టి పోరును  రేవంత్ వర్సెస్ కేటీఆర్ గా మలచడం కాంగ్రెస్ వ్యూహంలో భాగం.

సైకలాజికల్ వార్  

ప్రతిపక్ష నేతగా కేటీఆర్  లేవనెత్తే అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వ్యక్తిగత విమర్శలు ఒక అస్త్రంగా పనిచేస్తాయి. కేటీఆర్ ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్‌ను టార్గెట్ చేయడం ద్వారా ఆయన ప్రతిష్టను దెబ్బతీయడం, డిఫెన్స్‌లోకి నెట్టడం మరియు మానసికంగా ఆయన విశ్వాసాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ  పర్సనల్ ఎటాక్స్  సాగుతున్నాయనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో, తెలంగాణ సంప్రదాయ రాజకీయాల్లో మాస్ శైలికి పెద్దపీట ఉంటుంది. కేటీఆర్ అర్బన్, కార్పొరేట్ లుక్‌కు భిన్నంగా తన  పక్కా మాస్,  తెలంగాణ రఫ్ అండ్ టఫ్  ఇమేజ్‌ను బలంగా చాటుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు.  నేను కేడర్ నుంచి వచ్చిన మాస్ లీడర్‌ను, కేటీఆర్ అలా కాదు అనే సందేశాన్ని ప్రజల్లోకి పంపడానికే ఆయన ఈ తరహా పోలికలను తీసుకొస్తున్నారు.

ప్రజా సమస్యల నుంచి టాపిక్ డైవర్షన్ కోసమేనా? 

అయితే, ఈ విమర్శల నాణేనికి మరోవైపు కూడా ఉంది. ప్రతిపక్షం లేవనెత్తే మూసీ ప్రక్షాళన, గ్యారెంటీ అస్యూరెన్స్‌లు, విద్యుత్, నీటి సమస్యలు వంటి విధానపరమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, వ్యక్తిగత అంశాలపై పడటం కాంగ్రెస్ ప్రభుత్వ డిఫెన్సివ్ మైండ్ సెట్‌ను చూపుతోందని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. పరిపాలనాంశాలపై కంటే ఇలాంటి వ్యక్తిగత పోరు ఎక్కువైతే, అది చివరికి ప్రజా సమస్యల చర్చను పక్కదారి పట్టిస్తుంది. రేవంత్ రెడ్డి వేస్తున్న ఈ వ్యక్తిగత బాణాలు కేటీఆర్‌ను సైకలాజికల్‌గా దెబ్బతీసేందుకు వేసిన స్కెచ్ కావచ్చు, లేదా కేసీఆర్ లేని లోటును కేటీఆర్‌కు అప్పగిస్తూ ఆయన్ను ప్రధాన ప్రత్యర్థిగా నిలబెట్టే వ్యూహం కావచ్చునని అంచనా వేస్తున్నారు.