Pawan Kalyan: ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా కొణిదెలతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా ప్రెస్ నోట్ విడుదల చేసారు.
ఈ ప్రెస్ నోట్ లో.. పరస్పర అంగీకారం, అవగాహనతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. జీవితంలో ఎంతోకాలం కలిసి ప్రయాణించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. మా వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నాం. విడిపోయినా మంచి స్నేహితులుగా కొనసాగుతాం. పిల్లల తల్లిదండ్రులుగా మా బాధ్యతలు కొనసాగిస్తాం. పిల్లల సంతోషం, భవిష్యత్తే మా ఇద్దరి ఉమ్మడి ప్రాధాన్యత. ఈ వ్యక్తిగత పరిణామంలో మా గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నాం. మా ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని తెలిపారు.
దీంతో పవన్ విడాకులు వార్త సంచలనంగా మారింది. గతంలో ఆల్రెడీ రెండు సార్లు విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు విడాకులు ప్రకటించడంతో ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇటీవల కొన్ని రోజుల ముందు నుంచి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో మాట్లాడుతూ, భారత సాంప్రదాయాలను గౌరవిస్తూ, పవన్ గురించి పోస్టులు పెట్టి ఇలా సడెన్ గా విడాకులు ప్రకటించడంతో ఆశ్చర్యపోతున్నారు అంతా. కొన్ని రోజుల క్రితమే అన్నా తన సోషల్ మీడియా అకౌంట్ ని కూడా డీ యాక్టీవ్ చేయడం గమనార్హం.


