HP OmniBook 5, ProBook 4 G2iS: ప్రముఖ టెక్నాలజీ సంస్థ HP భారత మార్కెట్లో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. HP OmniBook 5 14, HP ProBook 4 G2iS 14 పేర్లతో వీటిని తీసుకొచ్చింది. వీటిలో OmniBook 5ను ప్రధానంగా విద్యార్థులు, రోజువారీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించగా.. ProBook 4 G2iSను చిన్న వ్యాపారాలు, ప్రొఫెషనల్స్ అవసరాలకు అనుగుణంగా తయారు చేసింది. రెండు ల్యాప్‌టాప్‌లలోనూ OLED డిస్‌ప్లే, Intel Core 7 ప్రాసెసర్ ఆప్షన్ ఉన్నాయి. అయితే డిజైన్, హార్డ్‌వేర్, సెక్యూరిటీ ఫీచర్ల విషయంలో వీటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.

HP OmniBook 5, ProBook 4 G2iS ధరలు

భారత్‌లో HP OmniBook 5 14 ప్రారంభ ధర రూ.1,09,999గా నిర్ణయించారు. అయితే ప్రీ-బుకింగ్ సమయంలో అందుబాటులో ఉండే ఆఫర్లతో ఈ ల్యాప్‌టాప్‌ను రూ.79,999కే కొనుగోలు చేసే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఈ ల్యాప్‌టాప్‌ నవంబర్ 10 వరకు ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. HP ఆన్‌లైన్ స్టోర్ లేదా HP వరల్డ్ స్టోర్ ద్వారా ప్రీ-బుక్ చేసిన కస్టమర్లకు నవంబర్ 10 నుంచి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే రోజు నుంచి అధీకృత రిటైలర్ల వద్ద కూడా విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

మరోవైపు, HP ProBook 4 G2iS 14 ప్రారంభ ధర పన్నులు మినహాయించి రూ.86,000గా ఉంది. మిస్ట్ సిల్వర్ కలర్ వేరియంట్ నవంబర్ 6 నుంచి అందుబాటులోకి రానుంది. కొన్ని కాన్ఫిగరేషన్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. అట్మాస్ఫెరిక్ బ్లూ, ఎక్లిప్స్ గ్రే కలర్ వేరియంట్లు డిసెంబర్ 2026 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

HP OmniBook 5, ProBook 4 G2iS డిస్‌ప్లేలు

ఈ రెండు ల్యాప్‌టాప్‌లలోనూ 14 అంగుళాల OLED డిస్‌ప్లేను అందించారు. అయితే స్క్రీన్ రిజల్యూషన్ విషయంలో ProBook ముందుంది. ఇందులో 2.8K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంది. OmniBook 5లో 100 శాతం DCI-P3 కలర్ కవరేజ్‌తో పాటు HP Eye Ease టెక్నాలజీని అందించారు. దీని వల్ల మెరుగైన రంగుల నాణ్యతతో పాటు కంటి సౌకర్యానికి ఉపయోగపడే ఫీచర్లు లభిస్తాయి.

రెండు ల్యాప్‌టాప్‌లు Intel Core 7 ప్రాసెసర్ వరకు ఉన్న కాన్ఫిగరేషన్లలో లభిస్తాయి. అయితే వీటిలోని NPU సామర్థ్యంలో స్వల్ప తేడా ఉంది.

HP OmniBook 5: 16 TOPS వరకు NPU సామర్థ్యం, 16GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్.
HP ProBook 4 G2iS: 17 TOPS వరకు NPU సామర్థ్యం, 32GB వరకు RAM, 1TB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్.

HP OmniBook 5లో FHD IR కెమెరా అందించారు. ProBook 4 G2iSలో IR సెన్సార్‌తో కూడిన FHD HDR కెమెరా ఉంది. రెండు ల్యాప్‌టాప్‌లలోనూ Windows Hello ఫేషియల్ రికగ్నిషన్, డ్యూయల్ మైక్రోఫోన్లు ఉన్నాయి. OmniBook 5 స్పీకర్లను Poly Studio ట్యూన్ చేసింది. అలాగే DTS Ultra సపోర్ట్ కూడా ఉంది. ProBookలో వీడియో కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తగ్గించేందుకు AI ఆధారిత నాయిస్ రిడక్షన్ టెక్నాలజీని అందించారు.

ProBookలో అదనపు సెక్యూరిటీ ఫీచర్లు

బిజినెస్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ProBook 4 G2iSలో కొన్ని ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లను ఇచ్చారు.

ఫిజికల్ కెమెరా ప్రైవసీ షట్టర్
HP Drive Lock
HP Secure Erase
Windows Hello ఫేషియల్ రికగ్నిషన్
OmniBook 5లో ప్రధానంగా Windows Hello ఫేషియల్ రికగ్నిషన్ సెక్యూరిటీ ఫీచర్‌గా అందుబాటులో ఉంది.

బ్యాటరీ విషయంలో HP OmniBook 5 ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లో లోకల్ వీడియో ప్లేబ్యాక్ సమయంలో 42 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని HP పేర్కొంది. అయితే బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ వేగానికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. బాక్స్‌లో 65W USB Mini GaN ఛార్జర్‌ను అందిస్తోంది. ProBook 4 G2iSలో 70Wh బ్యాటరీ ఉంది. ఇది HP Fast Charge టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.

బరువు, డిజైన్, కనెక్టివిటీ

బరువు, పరిమాణం విషయంలో ఈ రెండు ల్యాప్‌టాప్‌లు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.

HP OmniBook 5: 11.77mm మందం, 1.16 కిలోల బరువు.
HP ProBook 4 G2iS: 12mm మందం, 1.18 కిలోల ప్రారంభ బరువు.
OmniBook 5లో 180 డిగ్రీల వరకు తెరుచుకునే హింజ్‌ను అందించారు. అలాగే రెండు ఫుల్-ఫంక్షన్ USB Type-C పోర్టులు ఉన్నాయి.