విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి ఘన విజయం సాధించారు. జీవీఎంసీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వరుదు కల్యాణిపై 2,44,644 ఓట్ల ఆధిక్యంతో ముక్కా శ్రావణి గెలుపొందారు. కూటమి అభ్యర్థి శ్రావణికి మొత్తం 5,85,454 ఓట్లు రాగా, వరుదు కల్యాణికి 3,40,810 ఓట్లు వచ్చాయి. గెలిచిన అనంతరం ఇంజినీరింగ్ కళాశాల పరిపాలనా భవనంలో రిటర్నింగ్ అధికారి ఛాంబర్‌లో ముక్కా శ్రావణికి ఎన్నికల విన్నింగ్ సర్టిఫికెట్ అందజేశారు. దీంతో మేయర్ ఎన్నిక ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయిపోయింది.
జీవీఎంసీలో మొత్తం 120 కార్పొరేటర్లలో టీడీపీ + జనసేన + బీజేపీ కలిపి 98 స్థానాలు నెగ్గగా, వైసీపీకి వైసీపీ 13 స్థానాలు, స్వతంత్రులు 8 స్థానాలు గెలుపొందగా, CPI(M) 1 స్థానం దక్కించుకుంది.
GVMC ఎన్నికలు.. పార్టీ వారీగా విజేతల వివరాలు
విశాఖపట్నం జీవీఎంసీ 120 వార్డుల కార్పొరేటర్ ఎన్నికల ఫలితాలు
టీడీపీ (TDP) 64
జనసేన (JSP) 26
వైసీపీ (YCP) 13
బీజేపీ (BJP) 8
ఇండిపెండెంట్లు 8
సీపీఎం 1
మొత్తం వార్డులు :120
వార్డుల వారీగా పార్టీ వివరాలు
టీడీపీ – 64 వార్డులు
1, 2, 3, 4, 8, 9, 10, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30, 35, 38, 44, 45, 47, 48, 49, 50, 51, 52, 55, 56, 60, 61, 63, 64, 66, 67, 68, 69, 70, 71, 72, 74, 77, 78, 82, 83, 87, 89, 90, 91, 96, 97, 100, 101, 107, 108, 116, 117, 120.
జనసేన – 26 వార్డులు
5, 11, 12, 26, 31, 32, 33, 34, 37, 40, 43, 46, 62, 75, 79, 80, 93, 95, 102, 103, 109, 110, 112, 113, 114, 115.
వైసీపీ గెలిచినవి – 13 వార్డులు
6, 7, 19, 42, 59, 65, 76, 84, 92, 94, 99, 104, 119.
బీజేపీ విజేతలు – 8 వార్డులు
53, 54, 57, 58, 81, 85, 88, 111.
ఇండిపెండెంట్లు – 8 వార్డులు
36, 39, 41, 73, 86, 98, 106, 118.
సీపీఎం – 1 వార్డు 105.
* టీడీపీ 64 స్థానాలు.
* జనసేన 26 స్థానాలు.
* బీజేపీ 8 స్థానాలు..
* కూటమి మొత్తం కలిపి 98 స్థానాలు.
* వైసీపీ 13 స్థానాలు.
* స్వతంత్రులు 8 స్థానాలు.
* CPI(M) 1 స్థానం.

