India vs New Zealand 1st ODI: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లోని తొలి మ్యాచ్ నేడు ఆక్లాండ్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. 28.3 ఓవర్లలో న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (13) క్రీజులో ఉన్నాడు. అర్ష్‌దీప్ సింగ్ విల్ యంగ్, హెన్రీ నికోల్స్‌లను అవుట్ చేయగా, గుర్నూర్ బ్రార్ టిమ్ సీఫెర్ట్, టామ్ లాథమ్‌లను అవుట్ చేశాడు. అలాగే, అన్షుల్ కాంబోజ్ మిచెల్ శాంటర్న్‌తోపాటు నాథన్ స్మిత్‌లను ఔట్ చేశాడు.

న్యూజిలాండ్‌కు బ్యాటింగ్.. సీఫర్ట్‌కు ఛాన్స్

న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) మాట్లాడుతూ డెవాన్ కాన్వే (Devon Conway) ప్రస్తుతం కోలుకుంటున్నాడని, ఈ మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలిపాడు. అతడి స్థానంలో టిమ్ సీఫర్ట్ (Tim Seifert) తుది జట్టులోకి వచ్చాడు. భారత జట్టు తరహాలోనే న్యూజిలాండ్ కూడా నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతోంది.

శుభ్‌మన్ గిల్ ఏమన్నాడంటే?

టాస్ అనంతరం గిల్ మాట్లాడుతూ.. పరిస్థితులు మేఘావృతంగా ఉన్నాయని, అందుకే మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. సిరీస్ కోసం ఆటగాళ్లంతా ఉత్సాహంగా, సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. దక్షిణాఫ్రికాలో ఆడబోయే పరిస్థితులకు ఇక్కడి వాతావరణం దగ్గరగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

భారత జట్టులో నలుగురు పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ చోటు దక్కించుకున్నారు.

పిచ్ రిపోర్ట్: భారీ స్కోరు ఖాయమేనా?

సైమన్ డౌల్ (Simon Doull) పిచ్ గురించి మాట్లాడుతూ.. మైదానంలో బౌండరీలు కొట్టేందుకు కొన్ని మంచి ప్రాంతాలు ఉన్నాయని తెలిపాడు. పిచ్‌పై మంచి గడ్డి ఉందని, పరుగులు సాధించేందుకు అనుకూలంగా ఉందని పేర్కొన్నాడు. ఈ మైదానంలో 300 పరుగులు మంచి స్కోరుగా కనిపిస్తున్నా, అంతకంటే ఎక్కువ పరుగులు కూడా అవసరం కావచ్చని అంచనా వేశాడు. దీంతో అభిమానులకు భారీ స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం ఉంది.

భారత్ తుది జట్టు (Playing XI)..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.

న్యూజిలాండ్ తుది జట్టు (Playing XI)..

టిమ్ సీఫర్ట్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జేమీసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్.

ఇప్పుడు అందరి దృష్టి భారత బౌలర్లపై ఉంది. న్యూజిలాండ్ బ్యాటర్లను ఎంత త్వరగా పెవిలియన్‌కు పంపిస్తారో చూడాలి. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.