Whisky: మార్కెట్లో ఎన్నో రకాల ఆల్కహాల్ ఉన్నా... ఇండియన్స్ ఎక్కువగా విస్కీనే ఎందుకు ఇష్టపడతారు? అసలు.. మన దేశంలోకి విస్కీ ఎలా అడుగుపెట్టింది? ఇండియన్స్ ఫేవరేట్ గా ఎలా మారిపోయింది? దీని వెనక కథ ఏంటో తెలుసా?

కొత్త కొత్త బ్రాండ్లు, రకరాల కొత్త తరహా ఆల్కహాల్ బాటిల్లు ఇండియన్ మార్కెట్ లోకి రోజు రోజుకీ అడుగుపెడుతున్నాయి. ఎన్ని అడుగుపెట్టినా.. భారతీయుల మనసులోని విస్కీకి ఉన్న ప్రత్యేకమైన స్థానాన్ని మాత్రం ఏదీ ఎందుకు భర్తీ చేయలేకపోతోంది? మన దేశంలో ప్రజల లైఫ్ స్టైల్ మారినా డైనింగ్ రూల్స్ మారినా... పెళ్లిళ్లు, వేడుకలు, ఆఖరికి ఫ్రెండ్స్ తో సరదాగా గెట్ టూ గెదర్ పెట్టుకున్నా, సందర్భం ఏదైనా విస్కీ ఉండాల్సిందే. అసలు... భారత్ లో విస్కీ ఇంతలా పాతుకుపోవడం వెనక కారణం ఏంటి?

19వ శతాబ్దం మధ్యకాలంలో ఐరాపాలో ద్రాక్ష తోటలు నాశనమైనప్పుడు స్కాచ్ విస్కీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. బ్రిటీష్ అధికారులు, సైనికులు తాము వెళ్లిన ప్రతీ దేశానికి ఈ బాటిళ్లను మోసుకెళ్లారు. అలా 20వ శతాబ్దం ప్రారంభంలో విస్కీ మన దేశంలోకి అడుగుపెట్టింది. మొదట్లో ఈ విస్కీ వాడకంపై దేశంలో చాలా ఆంక్షలు ఉన్నా.. తర్వాతర్వాత.. నెమ్మదిగా క్లబ్స్, రాయల్ విందుల్లో ఆ తర్వాత.. భారతీయులు నిత్య జీవితంలోకి, ఇళ్లల్లోకి చేరిపోయింది.

మన వాతావరణానికి పర్ఫెక్ట్ మ్యాచ్...

భారతదేశంలో వాతావరణం వేడి ఎక్కువగా ఉంటుంది. విస్కీని వాటర్, సోడా లేదా వాటర్ క్యూబ్స్ తో కలిపి తీసుకుంటారు. దీంతో.. మన వాతావరణానికి ఇది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అందుకే.. ఇండియన్స్ దీనికి ఎక్కువగా కనెక్ట్ అవుతారు.

స్పైసీ ఫుడ్‌తో కిక్కెక్కించే కాంబినేషన్: మన భారతీయ వంటకాల్లో ఘాటైన మసాలాలు ఎక్కువ. కారంగా ఉండే నాన్-వెజ్, స్పైసీ ఫుడ్ తింటూ విస్కీతో కలిపి సోడా సిప్ చేస్తే ఆ కిక్కే వేరు. ఇది నాలుకపై ఉన్న మసాలా ఘాటును రీఫ్రెష్ చేస్తూ ఆహారాన్ని మరింత ఆస్వాదించేలా చేస్తుంది.

సినిమాలు సృష్టించిన ‘రాయల్’ ఇమేజ్: భారతీయ సినిమాలో విస్కీని ఎప్పుడూ ఒక పవర్, రాయల్టీ, హోదాకు సంకేతంగా చూపించారు. పెద్ద పెద్ద గాజు గ్లాసులు, రాయల్ బార్లు, శక్తివంతమైన క్యారెక్టర్లు విస్కీ గ్లాస్ పట్టుకుని కనిపించడంతో.. సాధారణ ప్రజల్లో కూడా దీనిపై ఒక లైఫ్‌స్టైల్ క్రేజ్ ఏర్పడింది.

గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తున్న 'మేడ్ ఇన్ ఇండియా' విస్కీ.. ఒకప్పుడు బ్రిటీష్ వారి నుంచి వచ్చిన ఈ విస్కీ సంస్కృతిని భారతీయులు ఎంతగా సొంతం చేసుకున్నారంటే.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా విస్కీ అమ్ముడవుతున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు, మన దేశంలో తయారయ్యే అమృత్ (Amrut), ఇంద్రి (Indri) వంటి హోమ్‌గ్రోన్ విస్కీ బ్రాండ్లు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారాలు సాధించి, గ్లోబల్ విస్కీ ప్రియులను సైతం మైమరిపిస్తున్నాయి.