Jayannth And The Jingo Pen : నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్ పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ దేశబోయిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జయంత్ అండ్ ది జింగోపెన్’. చైల్డ్ ఆర్టిస్ట్ జయంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి తాతగా, సత్యం రాజేష్ స్కూల్ టీచర్‌గా నటిస్తున్నారు. బేబీ ఊహా రెడ్డి, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమా నవంబర్ 12న చిల్డ్రన్స్ డే కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. చిన్నారులకు ఆలోచింపజేసే, మంచి సందేశాన్ని ఇచ్చేలా తెరకెక్కిన ఈ సినిమా పిల్లలకు, తల్లిదండ్రులకు, టీచర్స్ కి ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి ఈ సినిమా చూడాలి. తాజాగా జయంత్ అండ్ ది జింగో పెన్ సినిమా ట్రైలర్‌ను ఓ ప్రైవేట్ స్కూల్లో రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ చూసేయండి..
ఈ ట్రైలర్ ఈవెంట్లో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జయంత్ అండ్ ది జింగో పెన్ కథ చాలాబాగుంది. నేను కూడా ఓ టీచర్‌గా పని చేశాను. ఈ సినిమా హిందీలో వచ్చిన తారే జమీన్ పర్ లాగా పెద్ద విజయాన్ని అందుకుంటుంది. నేను మొదటి రోజే ఒక హాల్ మొత్తం బుక్ చేసుకొని నేను, మా టీచర్లు, మా స్టూడెంట్స్ అందరం కలిసి సినిమా చూస్తాము అని అన్నారు.
నిర్మాతలు ప్రవీణ్ బొలిశెట్టి, దివ్య మాట్లాడుతూ.. నవీన్‌కి జాతీయ అవార్డులు వచ్చాయి. బయటి భాషల్లో సినిమాలు చేసి అవార్డులు సాధించారు. అమ్మా, నాన్న, గురువు గొప్పదనం చెప్పేలా ఈ సినిమా ఉంటుంది. మా అబ్బాయి జయంత్ చక్కగా నటించాడు. ఈ సినిమాకి పాటలు, మాటలు, ట్యూన్స్ అన్నీ నేను ఇచ్చాను. విద్యా వ్యవస్థపై ఎక్కుపెట్టే సినిమా ఇది. ప్రతీ ఒక్క స్టూడెంట్ మనసుని టీచర్ అర్థం చేసుకోవాలి. వారు సాధించే మార్కుల కంటే వారి మనసుల్ని చూడాలని, అర్థం చేసుకోవాలని ఈ మూవీని తీశాం అని తెలిపారు.
Also Read : Oh Na Siddayya : సోనూసూద్ గెస్ట్ గా ఓ నా సిద్ధయ్య సాంగ్ రిలీజ్..
నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. జయంత్ అండ్ ది జింగో పెన్ లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి కళాత్మక సినిమాల్ని ప్రజలు ఆదరించాలి. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఎంతో మంచిని గ్రహించొచ్చు అని అన్నారు. మాస్టర్ జయంత్ మాట్లాడుతూ.. యాక్టింగ్‌లో మెళుకువలు నేర్పిన సత్యం రాజేష్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్ గారికి థాంక్స్. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. పిల్లలు రెగ్యులర్‌గా ఎదుర్కొనే సమస్యలు టీచర్స్ అండ్ స్టూడెంట్స్ రిలేషన్, తల్లిదండ్రులు, తాత ఎమోషన్స్ పై సినిమా ఉంటుందని అన్నారు.

