ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా.. 8 చోట్ల ఎన్నికలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 92 స్థానిక సంస్థల్లో ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,378 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జాతీయం
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. విజయవాడ 55వ డివిజన్లో నిలిచిన పోలింగ్!

ఈ కంటెంట్‌ను NTV Telugu - Andhra Pradesh ప్రచురించింది; IB9TV దీనిని రాయలేదు, ఎడిట్ చేయలేదు. అసలు వార్త చూడండి
