ఏళ్ళు గడిచేకొద్దీ పోషకాహార అవసరాలు మారుతుంటాయి, కాబట్టి కొన్ని అలవాట్లను మార్చుకోవడం చాలా ముఖ్యం. అధికంగా ప్రాసెస్ చేసిన రోజూ తీసుకోవడం వల్ల సోడియం, చెడు కొవ్వులు శరీరంలోకి వెళ్తుంది. ఇంకా చక్కెర పానీయాలు పోషకాలను పెంచకుండా కేలరీలను పెంచుతాయి. అధిక మద్యపానం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పురుషులు ఇష్టపడే ప్రతి ఆహారాన్ని మానేయాలని కాదు. ఆహారపు అలవాట్లను మార్చుకుంటే చాలు.

20, 30 ఏళ్ల వయసులోనే లేనిపోని అలవాట్లు మొదలవుతాయి. బయట తినడం, రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వంటివి ఈ వయస్సులోనే మొదలవుతాయి. 20, 30 ఏళ్ల వయసున్న పురుషులు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్‌ను ఫుడ్ డైట్ లో చేర్చుకోవాలి ఇంకా చురుకుగా ఉండటంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు, చికెన్, చేపలు, పాలు, పెరుగు, బీన్స్ పప్పులు, రాజ్మా శనగలు వంటివి తీసుకోవాలి.

40 ఏళ్లలో పురుషుల చురుకుగా, బలంగా ఉండగలరు, కానీ ఈ సమయంలో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి కాబట్టి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ దశలో, రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర సమస్యలు రాకుండా చూసుకోవాలి. బీన్స్, వాల్నట్స్, జామకాయ, గ్రీన్ టీ, వంకాయ, పాలు, డార్క్ చాక్లెట్లను మితంగా తీసుకోవాలని అంటున్నారు.

పురుషులకు 50 ఏళ్లు వచ్చేసరికి, కండరాలను కాపాడుకుంటూ ఉండాలి అలాగే హృదయ సంబంధ ఆరోగ్యాన్ని రక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం. 20 ఏళ్ల వయసు వారితో పోలిస్తే 50 ఏళ్లు పైబడిన పురుషులలో జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది అప్పుడు వీరికి తక్కువ కేలరీలు అవసరం అవుతాయి. ఎక్కువ కాకపోయినా ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఉన్న ఫుడ్స్ తీసుకోవడం అంతే ముఖ్యం. సాల్మన్ వంటి కొవ్వు చేపలను మీ ఆహారంలో చేర్చుకోవాలి.

పురుషులకు వయసు పైబడే కొద్దీ అతిపెద్ద పెద్ద పోషకాహార సమస్య, కండరాల బలం తగ్గిపోతోంది. దీనిని సార్కోపెనియా అంటారు. ఇది సమతుల్యత రోజువారీ కార్యకలాపాల సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే వృద్ధాప్యంలో అధిక ప్రోటీన్ అవసరం అవుతుంది. 60 ఏళ్ల తర్వాత ఆహారంలో కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలని చెబుతున్నారు.

